calender_icon.png 20 April, 2025 | 9:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆ కులాలను బీసీ జాబితాలో చేర్చడం హర్షనీయం

10-04-2025 12:23:38 AM

బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ

ముషీరాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి) : కాంగ్రెస్ పార్టీ మేని ఫెస్టోలో పొందు పరిచిన విధంగా తొల గించిన 26 బీసీ కులాలను బీసీ జాబితాలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వానికి బీసీ కమిషన్ సిఫార్సు చేయడం పట్ల తొల గించిన 26 బీసీ కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ బుధవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.

సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విష యంపై పలుమార్లు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగిం దన్నారు.

దీనిపై వారు స్పందించి బీసీ కమిషన్‌కు లేఖ రాశారని పేర్కొన్నారు.  ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి మండలికి, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, సభ్యులకు ఆళ్ల రామకృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.