ఫైలేట్ ప్రాజెక్ట్ గా గుడిబండ గ్రామం ఎన్నిక...
ఎన్నిక చేసినందుకు కోదాడ ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం..
కోదాడ (విజయక్రాంతి): పేద ప్రజలకు పథకాలు గుర్తించి ఇవ్వడం హర్షనియమని జిల్లా గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు తుమాటి వరప్రసాద్ రెడ్డి ఆదివారం అన్నారు. కోదాడ మండల పరిధిలోని గుడిబండ గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేసినందుకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు. సంక్షేమ పథకాలను ప్రారంభిస్తున్నామని ఇప్పటినుండి ప్రారంభం అవుతాయని తెలియజేశారు. ఈ ప్రక్రియ నిరంతరం ఉంటుందని తెలిపారు. ఆర్డిఓ సూర్యనారాయణతో కలిసి ప్రజా పాలన సంక్షేమ పథకాలను ప్రారంభించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. పథకానికి ఒక కౌంటర్ ను ఏర్పాటు చేసి అధికారుల ద్వారా సంక్షేమ పథకానికి సంబంధించిన పత్రాలను అందించారు. అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాహసీల్దార్ వాజిద్ అలీ, ఏవో రజిని, ఉపాధ్యక్షుడు ఇర్ల సీతారాంరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ లు ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి, నలజాల శ్రీనివాసరావు, నాయకులు తుమాటి నాగిరెడ్డి, నర్సిరెడ్డి, కుక్కడపు నాగరాజు, సైదులు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు.