16-02-2025 12:24:00 AM
* హై బిజ్ టీవీ రియల్టీ అవార్డుల ప్రదానోత్సవంలో
* సినీనటుడు మురళీ మోహన్
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): రియల్ ఎస్టేట్ రంగంలో కృషి చేస్తున్న వారిని గుర్తించి, వారికి హైబి టీవీ అవార్డులు ఇవ్వడం హర్షణీయమని ప్రముఖ సినీనటుడు మురళీ మోహన్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో హై బిజ్ టీవీ రియల్టీ అవార్డుల ప్రదానోత్సవ రెండో ఎడిషన్ జరిగింది.
ఈ సందర్భంగా రియల్టీ సెక్టార్‌లో విశేష సేవలు అందిస్తున్న 40కిపైగా సంస్థలు, వ్యక్తులకు పురస్కారాలిచ్చారు. 12 మందికి లెజెండ్ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని చేపట్టిన హై బిజ్ టీవీని అభినందించారు.
నగరంలో ఒకప్పుడు నిర్మాణ పనుల కోసం మలేషియా, సింగపూర్, దుబాయ్‌కి చెందిన సంస్థలు పని చేసేవని.. కానీ ఇప్పుడు మనమే అత్యద్భుత నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పారు. మరో రెండేళ్లలో 100 ఫ్లోర్ల భవనాలు ఇక్కడ ఏర్పాటవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ,- ది సియాసత్ డైలీ న్యూస్ ఎడిటర్ అమీర్‌అలీ ఖాన్, ఐజీబీసీ-సీఐఐ నేషనల్ వైస్ చైర్మన్ సీ శేఖర్‌రెడ్డి, క్రెడాయ్ హైదరాబాద్ ప్రెసిడెంట్ వీ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ మహాసిమెంట్ మార్కెటింగ్ ప్రెసిడెంట్ విజయ్‌వర్ధన్‌రావు, డైరెక్టర్ వీరా ఆర్‌ఎంసీ వీ నరసింహారెడ్డి,- హై బిజ్ టీవీ, తెలుగు నౌ ఎండీ ఎం రాజ్‌గోపాల్, హై బిజ్ టీవీ ఎల్‌ఎల్‌పీ ఎండీ డాక్టర్ జే సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.