13-04-2025 12:31:46 AM
ఆలుమగలు ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యంగా ముందుకు సాగితేనే సంసారం సాఫీగా సాగుతుంది. అయితే కాపురం అన్నాక కలతలు సహజం. ఏదోక సందర్భంలో చిచ్చు రేగడం ఖాయం. ఇటువంటప్పుడే భార్యాభర్తలు పట్టూవిడుపులు ప్రదర్శిస్తే సంసార జీవితం సుఖమ యమవుతుంది. ప్రస్తుతకాలంలో ఈ బంధం పలుచబడుతున్నది. చిన్న కారణాలకే విడాకుల వరకూ వెళ్తోంది. ఇలా కాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం..
పెళ్లికాక ముందే భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకో వడం మంచిది. అవతలివారిని మెప్పించా లని ము సుగేసుకోవద్దు. మీరు మీరులా ఉండటం వ ల్ల భవిష్యత్తులో వచ్చే చాలా సమస్యలకు ముందే ఆడ్డుకట్ట వేయవచ్చు. పెళ్లయిపోయింది కదా అని భాగస్వామి గురించి పట్టించుకోకుం డా ఉండటమూ సరికాదు. సందర్భా న్ని బట్టి ఎదుటివాళ్లు మారిపోవచ్చు. ఆ పరిస్థితుల్ని అర్ధం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ఎదురయ్యే చిన్న సమస్యల్ని దిద్దుకునే ప్రయత్నం చేయాలి. నచ్చని విషయాలను పదే పదే ప్రస్తావించడం, పాత గొడవల్ని తవ్వడం వల్ల దూరం మరింత పెరుగుతుంది.