calender_icon.png 13 January, 2025 | 7:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందుకుంటోంది

06-12-2024 11:38:34 PM

ప్రజా ప్రభుత్వం పిలిచింది పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు...

ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి (విజయక్రాంతి): రాష్టంలో ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు సహా అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజల మన్ననలు అందుకుంటోందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలు 2024 సందర్భంగా.. స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రాష్ట్ర స్థాయి కళాకారులచే ప్రజా ప్రభుత్వం పిలిచింది పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఆదర్ష్ సురభి హాజరయ్యారు. రాష్ట్ర సాంస్కృతిక సారధి నుంచి వచ్చిన ప్రముఖ కళాకారుడు అంతడుపుల నాగరాజు బృందం ప్రభుత్వం ఇప్పటివరకు ప్రవేశ పెట్టిన పథకాలపై ఇచ్చిన ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ పోరాట యోధులు, పోతరాజులు, బతుకమ్మ వంటి వాటిపై నృత్య ప్రదర్శనలు, ప్రజా ప్రభుత్వం పిలిచింది, ప్రజా పాలన వచ్చింది అనే అంశాలపై నాటికలను సుమారు 80 మంది కళాకారులు ప్రదర్శించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల కార్యక్రమాలపై కళాకారులు ప్రదర్శనలు అందరిని ఆకట్టుకున్నాయన్నారు. తెలంగాణలో ప్రజా ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు, గృహలక్ష్మి సహా ఆరోగ్యారెంటీలను అమలు చేస్తుందన్నారు. రైతులకు రుణమాఫీ, చరిత్రలోనే తొలిసారిగా సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ వంటి నిర్ణయాలతో ప్రజల మన్ననలు చురగుంటుందని చెప్పారు. త్వరలోనే ప్రభుత్వం వృద్ధులు వికలాంగులకు పెన్షన్ సాయం కూడా పెంచబోతుందని చెప్పారు.

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన ఏడాది కాలంలోనే 53,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత ప్రజా ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. మహిళా శక్తి కార్యక్రమం క్రింద మైక్రో ఎంటర్ ప్రైసెస్, పాడి పరిశ్రమ, క్యాంటీన్ల నిర్వహణ వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా అంతడుపుల నాగరాజు నేతృత్వంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చిన కళాకారుల బృందాన్ని కలెక్టర్ అభినందించారు. అంతడుపుల నాగరాజును కలెక్టర్ శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి సీతారాం, పురపాలక చైర్మన్ పుట్టపాకుల మహేష్, జిల్లా వివిధ శాఖల అధికారులు, కళాకారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.