calender_icon.png 12 March, 2025 | 12:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సనాతన ధర్మాన్ని పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత

10-03-2025 12:10:01 AM

ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్, మార్చి 9 (విజయక్రాంతి): ప్రపంచమంతా భారతదేశం వైపు చూస్తున్నదని.. హిందువుల పండగలపై ప్రపంచమంతా చర్చ జరుగుతుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నా రు. ఆదిలాబాద్ లోని తాటిగూడ, బోరజ్ మండలం సాంగి గ్రామాల్లో నూతన రామాలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని, ప్రత్యేక పూజలు చేశారు. 

సనాతన ధర్మం పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని ఎమ్మెల్యే సూచించారు. మన సనాతన ధర్మం  పై రీసెర్చ్ జరుగుతుందన్నారు. సనాతన ధర్మంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టమన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఐక్యతగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కాలనీ వాసులు పెద్దఎత్తున పాల్గొన్నారు.