అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్న సందర్భంలో కొందరు ఎమ్మెల్యేలు కెమెరాలో కనిపించాలని అతృతతో ఉన్నారట. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టితోపాటు మరి కొందరు మంత్రులు అసెంబ్లీలో మాట్లాడుతు న్న సమయంలో సభలో కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు అటు, ఇటు తిరుగుతున్నారని సొంత పార్టీకి చెం దిన ఓ ఎమ్మెల్యేనే వ్యాఖ్యానించడం గమనార్హం. ఎమ్మెల్యేలు నిత్యం జనం లో ఉండాలని, కెమెరాల్లో కనిపించాలనే సోకు ఏంటో అర్థం కావట్లేదని సదరు ఎమ్మెల్యే నిట్టూర్చారు.