మత రాజకీయాలు నిలబడవు : అఖిలేశ్
కోల్‌కతా, జూలై 21: కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఎక్కువకాలం మనుగడ సాగించలేదని, తర్వలోనే పడిపోతుందని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్‌యాదవ్ జోస్యం చెప్పారు. మతం పేరిట రాజకీయాలు ఎక్కువ కాలం నిలబడవని హితవు పలికారు. బెంగాల్ పర్యటనలో ఉన్న అఖిలేశ్.. ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ నేతృత్వంలో జరిగిన ధర్మతల ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మతం పేరుతో దేశాన్ని విభజించే కుట్రలు పన్నుతున్న శక్తులు ఇప్పుడు విజయం సాధించినా అంతిమంగా ఓడిపోయని పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు బీజేపీని ఓడించారని, అంతేకాకుండా ఆ పార్టీతో పోరాడారని కొనియాడారు. యూపీలోనూ ఇదే జరిగిందని వెల్లడించారు.