09-04-2025 04:40:20 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): నిరుపేదల ఆకలి తీర్చడం అభినందనీయమని ముంబై వాస్తవ్యులు, జనత సభ్యులు గోలివాడ నరేష్ అన్నారు. బుధవారం తన తండ్రి గోలివాడ శంకరయ్య దశదినకర్మ సందర్భంగా నిరుపేదలు, యాచకులు, చిరు వ్యాపారులు, బాటసారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దీంతో జనహిత సేవాసమితి ఆధ్వర్యంలో 329వ సారి పట్టణంలో నిరుపేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జనత సేవా సమితి అధ్యక్షులు ఆడెపు సతీష్ మాట్లాడుతూ... అన్నదాన కార్యక్రమం విజయవంతం కోసం దాతలు ముందుకు రావాలని, సహాయ సహకారాలు అందించాలని కోరారు. అన్నదాన కార్యక్రమంలో జనహిత సేవాసమితి కోశాధికారి కొడిపెల్లి గిరి ప్రసాద్, గౌరవ సలహాదారుడు కందుల రాజన్న, సంగతి తిరుమల్, కార్యవర్గ సభ్యులు నిచ్చకోల గురుస్వామిలు పాల్గొన్నారు.