calender_icon.png 19 April, 2025 | 5:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధలకు అన్నదానం చేయడం అభినందనీయం

18-04-2025 06:32:21 PM

కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తూమాటి వరప్రసాద్ రెడ్డి

మునగాల: మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలోని ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో కోదాడ మండలం గుడిబండ గ్రామానికి చెందిన పులి వెంకటేశ్వర్లు హైదరాబాదులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. అయితే శుక్రవారం ఆయన జన్మదిన సందర్భంగా ఆశ్రమంలో ఉన్న అనాధలకు, వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీనియర్ నాయకులు తూమాటి వరప్రసాద్ రెడ్డి పాల్గొని ఆయన చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ... పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ. ఆడంబరాలకు పోకుండా నిడారంబరంగా  ఇలా  వృద్ధులు అనాధల మధ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం   సమాజ సేవ పట్ల వారినిబద్ధత ఆదర్శనీయమని నిరాదరణకు గురై ఎవరు లేని అనాధలకు వృద్ధులకు మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఇలా ప్రతి ఒక్కరు పులి వెంకటేశ్వర్లను ఆదర్శంగా తీసుకొని. ఇలాంటి అనాధ శరణాలయాల్లో వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు  నిర్వహించి వారి ఆకలిని తీర్చి  వారికి అండగా నిలవాలని   అన్నారు   ఇంకా ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులు పులి. మైసయ్య. పులి  నాగమణి.ఆశ్రమ నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ కోఆర్డినేటర్ వాచేపల్లి జ్యోతి.