21-02-2025 12:28:52 AM
కోదాడ, ఫిబ్రవరి 20: సందేశాత్మక చిత్రాలతో కోదాడ వాసులు సీని రంగంలో రాణించడం అభినందనీయమని అజగవా ఆరట్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘నేనెక్కడున్న‘ సినిమా డైరెక్టర్ కోదాడ పట్టణానికి చెందిన మాధవ్ ను కోదాడను పట్టణ ప్రముఖులు అభినందించారు. గురువారం పట్టణంలోని రాయల్ బేకరీ లో సినిమా యూనిట్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
నేనెక్కడున్న సినిమా డైరెక్టర్ మాధవ్ కోదాడ మాట్లాడుతూ... ప్రస్తుతం జర్నలిజం, సామాజిక కోణంలో నేనెక్కడున్న అనే చిత్రాన్ని హిందీ, తెలుగులో నిర్మించినట్లుగా తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాత మారుతి శాంప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారని , హీరో మిమో చక్రవర్తి, హీరోయిన్ శశాచత్రి, ప్రముఖునటులు బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, తనికెళ్ల భరణి, షియాజ్ సిండే, మహేష్ ముంజేకర్, ల తో పాటు చాలామంది సినీ పరిశ్రమ నటులు ఉన్నట్లుగా తెలిపారు. ఈనెల 28న ప్రేక్షకులకు ముందు రాబోతున్న చిత్రాన్ని ఆదరించాలని కోరారు. ఓ పిట్ట కథ డైరెక్టర్ చందు ముండేటి ఉన్నారు.