22-03-2025 12:00:00 AM
గాంధీనగర్ కార్పొరేటర్ ఎ.పావని వినయ్ కుమార్
ముషీరాబాద్, మార్చ్ 21: (విజయక్రాంతి) : దేవాలయ అభివృద్ధి నిర్మా ణ పనులకు దాతలు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడం అభినందనీయమని గాంధీనగర్ కార్పొరేటర్ ఎ. పావని వినయ్ కుమార్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం గాంధీనగర్ డివిజన్ ఎస్‌ఆర్‌టి కాలనీలోని నల్ల పోచ మ్మ, ఉప్పలమ్మ తల్లి దేవాలయం యొక్క నూతన అమ్మవారి కమాన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ కమాన్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమాన్ నిర్మా ణ దాత, కార్పొరేటర్ శ్రీనివాస్ యాదవ్‌ను అభినందిస్తూ బిజెపి సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీ నర్ ఎ.వినయ్ కుమార్ శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో బిజెపి డివిజన్ అద్యక్షుడు వి. నవీన్ కుమార్, బీజేపీ సీనియర్ నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, సురేష్, హన్మంత్, ఆనంద్ రావు, చర్ర యాదగిరి, సాయి సంతోష్, సత్యేందర్, ఎస్‌ఆర్‌టి కాలనీ వాసులు లడ్డు, ఎస్ ఆర్ టి శివ, పున్న సత్యనారాయణ, గుర్రం గణేష్, ఎం డి.గౌస్, సమర్ పాల్గొన్నారు.