calender_icon.png 19 April, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ డమ్మీ సీఎం అనేది స్పష్టమైంది

09-04-2025 12:00:00 AM

  1. డీఫ్యాక్టో సీఎంలా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి 

సీఎం కోరలు లేని పాము

ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి 

నిర్మల్, ఏప్రిల్ 8 : కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ మీనాక్షి నటరాజన్ డీఫ్యా క్టో సీఎంలా వ్యవహరించడం శోచనీయం అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సచివాల యానికి వచ్చి మంత్రులతో కలిసి హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ భూముల వ్యవహా రాన్ని సమీక్షించడాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఇక డమ్మీ సీఎం అనేది స్పష్టమైపోయిందన్నారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనా పగ్గాలను రాహుల్ గాంధీ చేతిలోకి తీసుకున్నట్టుగా అర్థమవుతోందన్నారు. కాంగ్రెస్ ఇన్చార్జిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో మీనాక్షి నటరాజన్   ప్రభుత్వ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనని చెప్పారు కానీ ఆమె మాట తప్పి ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఏకంగా సచివాలయానికి రావడం వెనక రాహుల్ గాంధీ ఆదేశాలు ఉన్నాయని తేలిపోయిందన్నారు.

ముఖ్యమంత్రి హైదరాబాద్‌లోనే తన నివాసంలో ఉండగా మీనాక్షి నటరాజన్ ఏకంగా సచివాలయానికి వచ్చి మంత్రులతో కలిసి రివ్యూ చేయడాన్ని బట్టి సీఎం రేవంత్ రెడ్డి ఇక ఒట్టి కోరలు లేని పాము అని అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణను రాహుల్ గాంధీ రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించాలనుకుంటున్నారని, డీఫ్యా క్టో సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఇప్పు డు డమ్మీ సీఎంగా మిగిలిపోయిన రేవంత్ రెడ్డి త్వరలోనే మాజీ సీఎంగా మారతాడని తాజా పరిణామాలను బట్టి అర్థమవుతుందన్నారు. తెలంగాణ సకల జనులు కోట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ చులకన చేస్తోందని,  తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ పాదాల వద్ద తాకట్టు పెట్టడాన్ని రాష్ట్ర ప్రజ లు జీర్నించుకోలేకపోతున్నారన్నారు.

కాంగ్రె స్ గెలిస్తే మార్పు వస్తుందన్నారు, ఇదేనా మార్పు, రిమోట్ కంట్రోల్ పాలనేనా మార్పు అంటే అని ఎద్దేవా చేశారు. ఈ విలేకరులు సమావేశంలో బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, మెడిసెమ్మ రాజు, పట్టణ అధ్యక్షులు ఆకుల కార్తీక్, సుంకరి సాయి, తాజా మాజీ కౌన్సిలర్లు నరేందర్, నవీన్, పద్మాకర్, సత్యం చంద్రకాంత్, ముత్యం రెడ్డి, జమాల్, విలాస్, విజయ్, తిరుమల చారి, ముత్యం తదితరులు పాల్గొన్నారు.