28-04-2025 01:56:28 AM
ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
రాజేంద్రనగర్, ఏప్రిల్ 27 : పహల్గాంలో దాడి చేసిన ఉగ్రవాదులకు బు ద్ధి చెప్పడం ఖాయమని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో మోడీ ప్రభుత్వం సీరియస్ గా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆదివారం రాజేంద్ర నగర్ నియోజక వర్గ పరిధిలోని శివరామ్ పల్లి ప్రజా భవన్ లో బీజేపీ డివిజన్ ప్రెసిడెంట్ బాబురావు ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు.
ఈ కార్యక్రమానికి డాక్టర్ ఎంపీ లక్ష్మణ్ తో పాటు బిజెపి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు రాజ్ గోపాల్ గౌడ్, నియోజకవర్గ బిజెపి కంటేస్టడ్ ఎమ్మెల్యే అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ది పిరికిపంద చర్య అని తెలియజేశారు. ఉగ్రవాదులు ఈ భూమిపై ఎక్కడ దాకున్నా ఏరివేయడం ఖాయమని ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ పునరుద్గాటించారని గుర్తు చేశారు.
పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అనంతరం రాజ్ భూపాల్ గౌడ్, తోకల శ్రీనివాస్ రెడ్డి తదితరులు మాట్లాడుతూ.. ఇప్పటికే సింధు జలాలను భారత్ నిలిపివేయడంతో పాకిస్తాన్ కు దిక్కుతోచని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ సమయంలో పార్టీలకు అతీతంగా భారతీయులంతా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై శ్రీధర్, పార్లమెంట్ కన్వీనర్ మల్లారెడ్డి, ప్రభాకర్, కొమురయ్య, అసెంబ్లీ కన్వీనర్ మల్లేష్ యాదవ్ బొక్కబాల్ రెడ్డి, విజయ్ కుమార్,కాడేం సుధాకర్, జోగిరవి, రాచూరి రాజశేఖర్, సోల్కర్ రెడ్డి, జగన్,, సత్యనారాయణ, . బాబురావు, అడికె జనార్ధన్, సులిగె వెంకటేష్ పాల్గొన్నారు.