సభ్యత్వ నమోదులో ఎంపీ, ఎమ్మెల్యేలు
ఆదిలాబాద్/నిజామాబాద్/నాగర్‌కర్నూల్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): రాష్ట్రంలో రానున్నది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు అన్నారు. మంగళవారం పలు ప్రాంతాల్లో నిర్వహించిన పార్టీ సభ్యత్వ కార్యక్రమాల్లో వారు మాట్లాడారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి నాయకుడు, కార్యకర్త కృషి చేయాలని కోరారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు పతంగే బ్రహ్మానంద్ ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టారు. నిజామాబాద్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు దినేష్‌తో కలిసి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు మురళీధర్‌రావు ఆధ్వర్యంలో నాగర్‌కర్నూల్‌లో ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు.