calender_icon.png 31 January, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్షల డప్పుల గుండెచప్పుడు పాలకులు వింటే మంచిది..

31-01-2025 09:04:24 PM

యాదాద్రి భువనగిరి (విజయకాంతి): ఈనెల 7వ తేదీన హైదరాబాదులో జరిగే లక్షల డబ్బుల గుండెచప్పుడు ప్రభుత్వం వింటే మంచిది లేనట్లయితే వారి భవిష్యత్తును వారే తేల్చుకోవాల్సి వస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ రేవంత్ సర్కార్ను హెచ్చరించారు. వర్గీకరణ చేయాలంటూ మహానగరంలో తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో శుక్రవారం నిర్వహించిన డప్పుల సన్నాహక సభకు ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రపంచంలో ఎక్కడ జరగని సాంస్కృతిక ప్రదర్శన హైదరాబాదులో లక్షల డప్పులతో నిర్వహించి ప్రపంచానికి తమ డప్పు సప్పుడుతో ఆవేదనను గోడును వినిపించనున్నామని తెలిపారు. వర్గీకరణ ముందుగా తామే అమలు చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మాటలకు తల ఒగ్గి అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మాదిగల ఆశలు నిరాశలు చేసి ఉద్యోగులను భర్తీ చేస్తున్నారని అన్నారు. వర్గీకరణ అడ్డుకుంటుంది మాలలలోని కొంతమంది కాంగ్రెస్ స్వార్థపరులని, వాళ్లకు అంత శక్తి ఎలా వచ్చిందని కాంగ్రెస్ నాయకుల ఇచ్చిన మద్దతేనని అన్నారు.

వర్గీకరణకు అనుకూలంగా మూడు కమిషన్లు తీర్పు ఇచ్చిన, అసెంబ్లీలో మూడు సార్లు ఏకగ్రీవంగా తీర్మానం చేసిన అమలు చేయడంలో కాంగ్రెస్ పాలకులకు కలిగే ఇబ్బందేమని ప్రశ్నించారు. అన్ని పార్టీల ప్రధాన మంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఉన్న అడ్డుకుంటుంది కింది నుంచి పై దాకా కాంగ్రెస్ పార్టీలోని ముఖ్యమైన మాల నాయకులేనని మందకృష్ణ ఆరోపించారు. మల్లు అనంత రాములు జి వెంకటస్వామి కుటుంబాలే వర్గీకరణ అడ్డుకుంటూ మాదిగలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని కృష్ణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కేవలం మాల వర్గాల నాయకులని పెంచి పోషిస్తూ మాదిగ వర్గాల నాయకులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో వెంకటస్వామి కుటుంబం ఏకకాలంలో మూడు పదవులు తెచ్చుకొని ఆ పార్టీని శాసించే స్థాయిలో ఉన్నారని ఎస్సీ వర్గీకరణ చేస్తే నీ ముఖ్యమంత్రి పదవి తీసేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ మాల నాయకులు రేవంత్ రెడ్డిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన సంచలనమైన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ మొదలు పెట్టకపోతే తమ తడాఖా ఏమిటో రుచి చూపిస్తామని మందకృష్ణ హెచ్చరించారు.

36 సంవత్సరాలుగా వర్గీకరణ కోసం ఉద్యమిస్తూ ఏ పదవి తీసుకోలేదు ఏ కండువా మార్చలేదని అన్నారు. బీసీలకు నాయకత్వం వహించిన ఆర్ కృష్ణయ్య 15 ఏళ్లలో నాలుగు కండోలు మార్చడంతో పదవులు వచ్చాయని ఎద్దేవా చేశారు. వేల గొంతులు లక్షల డప్పుల ప్రదర్శనకి గ్రామ గ్రామాన డప్పులతో సమాచారం మాదిగ సోదరుల అందజేసి లక్షలాదిగా హైదరాబాదు నగరానికి డప్పులతో తరలిరావాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సహాయ కార్యదర్శి ఇటికల దేవేందర్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు నల్ల చంద్ర స్వామి మాదిగ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి సీనియర్ నాయకులు సందెల శ్రీనివాస్ మాదిగ, మంద శంకర్ మాదిగ, మీసాల గణేష్ మాదిగ, దానయ్య మాదిగ, బోయ లింగ స్వామి మాదిగ, జేరిపోతుల కరుణాకర్ మాదిగ, కొల్లూరి హరీష్ మాదిగ, కోళ్ల జహంగీర్ మాదిగ, నాగారం అంజయ్య మాదిగ, బండారు రవివర్ధన్ మాదిగ, బట్టు రామచంద్రయ్య మాదిగ, బర్రె జహంగీర్ మాదిగ, వేముల అశోక్ మాదిగ, కనుకుంట్ల జయ, రేణుక, మధు, సుభాష్, శివలింగం, మనోజ్, కొల్లూరు రాజు, దర్గాయారి ప్రసాద్, బండారు శివశంకర్ మాదిగ, రమేష్, కోటి, మేడి కోటేష్ తదితరులు పాల్గొన్నారు.