వేసవిలో సాగునీటికి త్రాగునీటికి కొదువ లేదు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వల్లే ఇది సాధ్యమైంది
భారీ వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
ప్రతి పక్షాలు బురుద రాజకీయాలు చేయడం మానుకోవాలి
గత అయిదు సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం పై మేయర్ సునీల్ రావు సమాధానం చెప్పాలి
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్, (విజయక్రాంతి): ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టం వరకు నిండడం శుభపరిణామం అని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మానేరు డ్యాం సందర్శించి నీళ్లల్లో పూలు వదిలి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు మరియు వరద కాలువ వల్లే మిడ్ మానేరు గాని లోయర్ మానేరు గాని నిండాయని గత పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టు నుండి చుక్క నీళ్ళు రాకున్నా ప్రజలను తప్పు దోవ పట్టించారని అన్నారు.రాబోయే వేసవిలో త్రాగు నీరుకు సాగు నీరుకు ఎటువంటి ఇబ్బంది ఉండదని నరేందర్ రెడ్డి పేర్కొన్నారు.
కరీంనగర్ నగర అభివృద్ధి పై మంత్రులకు మాకు పూర్తి అవగాహన ఉందని నిధుల విషయంలో మేయర్ సునీల్ రావు అవాకులు చవాకులు మాట్లాడుచున్నాడని గత అయిదు సంవత్సరాలుగా జరిగిన విధ్వంసం సంగతేందని నరేందర్ రెడ్డి ప్రశ్నించారు.ఈ కార్యక్రమంలో కొరివి అరుణ్ కుమార్,శ్రవణ్ నాయక్,సమద్ నవాబ్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి,పోరండ్ల రమేష్,జీడి రమేష్,దన్న సింగ్,ఖంరొద్దిన్,షబానా మహమ్మద్,ఊరడి లత,జ్యోతి రెడ్డి,మహాలక్ష్మి,రజితా రెడ్డి,మూల జైపాల్,మెరుగు స్వప్న,హస్తపురం తిరుమల,బషీర్,వెంకట్ రెడ్డి,అజ్మత్,జమాల్,ఇమామ్, మల్లిఖార్జున్,మాసుం ఖాన్,సాయి,భరత్, హనీఫ్ తదితరులు పాల్గొన్నారు.