calender_icon.png 28 February, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ వలస ఆదివాసి గ్రామాలను సందర్శించడం అభినందనీయం

28-02-2025 05:39:59 PM

సిపిఎం...

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ లక్ష్మీదేవిపల్లి మండలంలోని వలస ఆదివాసి గ్రామాలైన చింతల మోదీ, మద్ది గుంపులను సందర్శించడం వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారం చేస్తానని హామీ ఇవ్వడాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు అభినందించారు. వలస ఆదివాసీ గ్రామాలు అనేక సమస్యలతోనే ఇబ్బందులు పడుతున్నారని, ఆ గ్రామాలను కలెక్టర్ అధికారులతో సహా ద్విచక్ర వాహనంపై పర్యటించి, వారి సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని హామీ ఇవ్వడం అభినందనీయమని అన్నారు. 

జిల్లాలో చర్ల, దుమ్ముగూడెం, ములకలపల్లి, అశ్వాపురం, మణుగూరు, అశ్వరావుపేట, దమ్మపేట, పాల్వంచ రూరల్, లక్ష్మీదేవి పల్లి, బూర్గంపాడు వంటి మండలాలలో వందల గ్రామాలలో సుమారు 15 వేల జనాభా కలిగి ఉన్నారని ఆ గ్రామాలలో మంచినీరు, రహదారి, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. ఉన్నతాధికారులు ఇటువంటి పర్యటనలు చేయడం ద్వారా సమస్యలు మరింతగా తెలుసుకోవడానికి, వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరఫున కృషి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగానికి అవకాశం ఉంటుందని ఆ రకమైనటువంటి కృషిని జిల్లా కలెక్టర్ కొనసాగించాలని కోరారు. ఇటీవల చర్ల మండలంలో పులిగుండాల గ్రామపంచాయతీ పరిధిలో బక్కచింతలపాడు, కొండవాయి. తిప్పాపురం పంచాయతీ పరిధిలో అనేక గ్రామాలు మంచినీటి కొరతతో ఇబ్బంది పడుతున్నారని గర్భిణీ స్త్రీలు పసవ సందర్భంగా డోలి కట్టుకొని హాస్పిటల్స్ కు తీసుకొచ్చే మార్గం మధ్యలోనే చనిపోతున్నారని అనేక వార్తా కథనాలు ఇటీవల వెలువడినాయి. ఈ తరుణంలో కలెక్టర్  ఆదివాసి గుత్తి గుంపులను సందర్శించడం ఎంతైనా అభినందనీయమని మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. వలస ఆదివాసీలకు అనేక సంవత్సరాలుగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని ఉంటున్నటువంటి గ్రామాలలోని ప్రజలకు కొన్ని వసతులు కల్పించాలని, స్కూలు, వైద్యాలయాలు, రోడ్లు నిర్మించారని, రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు ఉన్నాయని వారి పిల్లలు చదువుతున్నారని అటువంటి వారు అందరికీ ప్రభుత్వం ఇటీవల అనేక ఆంక్షలు పెట్టి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

ఇప్పటికైనా ప్రభుత్వం దీర్ఘకాలికంగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న వలస ఆదివాసీలను మౌలిక వసతులు కల్పించాలని కోరారు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారంగా అక్కుపత్రాలు ఇవ్వాలని కోరారు. కొత్తగా ఎవరు పోడు కొట్ట వొద్దని అటువంటి వారిని తమ పార్టీ సిపిఎం సైతం మద్దతు ఇవ్వమని, ఏ రాజకీయ పార్టీ కూడా అటువంటి వాటిని ప్రోత్సహించకూడదని కోరారు. సిపిఎం పార్టీగా రాజ్యాంగబద్ధ హక్కుల సాధన కోసం, గిరిజనుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని, అటువంటి పోరాటాలను కొనసాగిస్తామని అన్నారు  జిల్లాలోని మొత్తం ఆదివాసీ గ్రామాలు, కుటుంబాలను సందర్శించి కలెక్టర్ గారికి పూర్తి వివరాలతో కూడిన నివేదికను సిపిఎం బృందం త్వరలో ఇవ్వనున్నదని తెలిపారు. ఆదివాసి గ్రామాలను అభివృద్ధి చేయడం ద్వారా వారిలో విజ్ఞానాన్ని, చైతన్యాన్ని పెంపొందించడం ద్వారా సమస్యలు తలెత్తకుండా ప్రోత్సహించాలని కోరారు. అందుకు సిపిఎం ఎల్లవేళలా సిద్ధంగా ఉన్నదని తెలిపారు.