calender_icon.png 13 January, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయం.. ఎమ్మెల్యే గడ్డం

12-01-2025 07:54:29 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో మహిళలకు సంక్రాంతి సందర్భంగా మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత ముగ్గుల పోటీలను నిర్వహించి ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే గడ్డం వినోద్(MLA Gaddam Vinod) అన్నారు. ఆదివారం సాయంత్రం బెల్లంపల్లి మున్సిపల్ అధ్యక్షురాలు జక్కుల శ్వేత ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఆసక్తికరంగా ముగ్గులను వేశారు. అనంతరం బహుమతుల ప్రధానం కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్ రమ దంపతులు పాల్గొని విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వినోద్ మాట్లాడుతూ.. రంగవల్లులకు సంక్రాంతి అత్యంత ప్రాధాన్యత కలిగిన పండుగగా మహిళలు గుర్తించి ముగ్గుల పోటీల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు.

బాలికలకు కూడా చిన్నతనం ఉండే ఆకర్షణీయంగా ముగ్గులు వేసేలా ప్రోత్సహించాలన్నారు. గత ఏడాది బెల్లంపల్లిలో కార్తీక పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నామని, పెద్ద ఎత్తున కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించుకున్నామని తెలిపారు. మరోసారి బెల్లంపల్లి పట్టణంలో కంటి వైద్య శిబిరం నిర్వహించేందుకు తన కూతురు గడ్డం వర్ష ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఎమ్మెల్యే వినోద్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏసీపి ఏ.రవికుమార్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, న్యాయ నిర్ణేతలు సువర్ణ, హనుమాండ్ల రమాదేవి, శాంకరి, లక్ష్మి, మహిళా కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, మెప్మా ఆర్ పి లు పాల్గొన్నారు.