calender_icon.png 21 December, 2024 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనుభవం ఉన్న వారిని రాతపరీక్ష రాయమనడం సిగ్గుచేటు

21-12-2024 04:36:38 PM

కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు రాస్తారోకో

పరీక్ష తీసివేసి అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని డిమాండ్...

కామారెడ్డి (విజయక్రాంతి): పనిలో అనుభవమున్నవారికి పరీక్ష నిర్వహిస్తామనడం సిగ్గుచేటు అయిన విధానమని ఏఎన్ఎంలు శనివారం కామారెడ్డిలో నిరసన వ్యక్తం చేశారు. కామారెడ్డి నిజాంసాగర్ చౌరస్తాలో రాస్తారోకో చేసి ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. 23 సంవత్సరాల అనుభవమున్న కాంటాక్ట్ ఏఎన్ఎం లను ప్రస్తుతం పరీక్ష రాసిన తర్వాతనే రెగ్యులర్ చేస్తామని చెప్పడం సిగ్గుచేటని కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండా తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాలోని కాంటాక్ట్ ఏఎన్ఎంలు మున్సిపల్ కార్యాలయం వద్ద రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మేము ఈ ఉద్యోగంలో చేరే సమయంలోనే పరీక్షలు రాసే ఉద్యోగంలో చేరడం జరిగిందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ఎన్నోసార్లు తమను రెగ్యులర్ చేయాలని కోరిన ఆ ప్రభుత్వం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాము రెగ్యులర్ అవుతామని ఎన్నో కలలకు కన్నామని ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ మాదిరిగానే వ్యవరిస్తుందన్నారు. ఏ పనిలోనైనా అనుభవం ముఖ్యమన్నారు. కామకు ప్రాక్టికల్ నాలెడ్జి ఉందని దాని ఆధారంగానే తమను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఏదో కారణం చెప్పి తమను ఈ ప్రభుత్వం తొలగించాలని చూస్తుందని, తమను రెగ్యులరైజ్ చేసే వరకు తాము ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కన్వీనర్ చంద్రశేఖర్, నాయకులు కొత్త నరసింహులు, ఆశా వర్కర్లు దీవెన, కవిత, అర్సియా, సంధ్యారాణి, స్వరూప, రేణుక, జోష్ణ దేవి, మౌనిక, విజయ, గంగమని, ఫ్లారెన్స్, బాలబాయి, శైలజ తదితరులు పాల్గొన్నారు.