07-07-2024 01:54:33 AM
న్యూఢిల్లీ, జూలై 6: జలపాతం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది భారీ కొండలపై నుంచి ఎంతో ఎత్తు నుంచి నురగలు కక్కుతూ కిందికి దూకే నీళ్లే కదా? అవును మరి చిన్నప్పటినుంచే అందరూ నయాగరా జలపాతం, జోగ్ జలపాతం అని చదువుకొంటారు కదా. జలపాతం అంటేనే నీళ్లు కదా! మళ్లీ ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది.. అంటారా? ఉంది.. పెద్ద విశేషమే ఉంది.. జలపాతమంటే నీళ్లు కిందికి దూకేదే కాదు.. ఒకచోట ఇసుక జలపాతం కూడా ఉంది. అదేంటి అంటారా? మీరు చదివింది నిజమే.. ఇదొక ఇసుక జలపాతం. సాధారణ జలపాతంలో నీళ్లు కిందికి దుంకినట్టు.. ఇక్కడ ఇసుక లోయలోకి దూతుకుంది. ఆఫ్రికా, అరేబియా ఎడారుల్లో చాలాచోట్ల ఇలాంటి ఇసుక పాతాలు కనిపిస్తాయి. కానీ, సాధారణ జలపాతంలా ఎప్పుడూ ఉండవు ఇవి. ఎడారుల్లో అప్పుడప్పుడు కురిసే వర్షాలకు ఇసుక పాతాలు ఏర్పడుతాయి.