calender_icon.png 23 February, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈ దీక్ష.. తెలంగాణ సిద్ధించేదాకా!

23-02-2025 12:00:00 AM

పేరుకే అదొక ఉద్యమ శిబిరం. కాని.. ఎంతోమంది ఉద్యమకారులకు పుట్టినిల్లుగా మారింది. దీక్ష మొదలైన నాటి నుంచి రాష్ట్రం సిద్ధించేదాకా అనేక పోరాటాలకు వేదికైంది. విద్యార్థులు, విద్యావంతులు, మహిళలు.. ఇలా అనేకమంది ఉద్యమించేలా సుదీర్ఘ నిరసనలకు నిలయమైంది. ఒకవైపు పండుగలు, మరోవైపు నిరసనలతో 1523 రోజులపాటు శిబిరం కొనగడం విశేషం. అదే ఆదిలాబాద్ శిబిరం.

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలోని దీక్షా శిబిరం నిరసనలతోపాటు పండుగలు, పబ్బాలకు వేదికయ్యింది. తెలంగాణ ఉద్యమకారుడు కారింగుల దామోదర్ ఆధర్యంలో 1523 రోజులపాటు సాగిన ఈ శిబిరం అప్పట్లో ఉద్యమకారులకు ఇల్లుగా మారింది. ప్రత్యేక రాష్ర్టం సాధించేంతవరకు కొనసాగింది ఈ శిబిరం. ఏ పండుగ వచ్చినా శిబిరంలో జరుపుకుంటూ ఉద్యమ నినాదాన్ని చాటారు. 

ప్రతీ పండుగ అక్కడే

ఈ శిబిరం నిరసనలతో పాటు అనేక పండుగలకు వేదికైంది. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, ఉగాది, బతుకమ్మ ఇలా ప్రతీ పండులో ఉద్యమ నినాదాలతో జరుపుకున్నారు. వినాయక చవితి సందర్భంగా 11 రోజులపాటు గణనాథునికి పూజలు చేశారు. తెలంగాణ ప్రజల్లో వెలుగులు నింపాలని కోరుతూ దీపావళికి  టపాసులు కాల్చి నిరసనను వ్యక్తం చేశారు. అందమైన ముగ్గులతో సంక్రాంతి, షెడ్రుచులతో కూడిన ఉగాదిని లాంటి ఎన్నో పండుగలకు వేదికైంది ఈ శిబిరం.

 ఆదిలాబాద్, (విజయక్రాంతి)

శిబిరమే ఇళ్లుంది

తెలంగాణ ఉద్యమం జరిగినన్ని రోజులు ఈ దీక్ష శిబిరమే నాకు ఇళ్లుంది. ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష శిబిరంలోని గడిపా. ఏ పండుగలొచ్చినా శిబిరంలోనే నిరహించుకునేవాళం. ఒకవైపు నిరసనలు చేస్తూనే, మరోవైపు పండుగలను సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా ప్రతి ఉద్యమకారుకి శిబిరమే ఇళ్లుంది. 

-కారింగుల దామోదర్, దీక్ష శిబిరం నిరాహకుడు

పండుగులు, నిరసనలు ఒకేసారి

సుదీర్ఘ కాలం పాటు సాగిన ఈ దీక్షలో ఒకవైపు నిరసనలు వ్యక్తం చేస్తూనే, మరోవైపు పండుగలను ఉత్సాహంగా జరుపుకున్నాం. మహిళలు, యువతులు సైతం పాల్గొని తెలంగాణ నినాదాలు చేశారు. ఉద్యమం జరిగినన్ని రోజులూ పండగలు, పబ్బాలు శిబిరం వద్దే జరుపుకున్నాం. అలాగే పాల్గొనేవారిని బహుమతులు కూడా అందించాం. 

 -కస్తాల ప్రేమల, తెలంగాణ ఉద్యమకారిణి