మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో న్యాయం కోసం పోలీసులే రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పడటం దారుణమని మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహిం చిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్డుమీదికి రావడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని ఆరోపించారు.
పోలీస్ కుటుంబాలు రోడ్డుపైకి రావ డం చరిత్రలోనే ఇదే మెదటసారని.. ప్రజా పాలన అంటే ఇదేనా అంటూ నిలదీశారు. రాష్ట్రానికి హోంమంత్రి లేకపోవటంతో పోలీసులు తమ బాధ ఎవరికి చెప్పుకోవాలే తెలియక ఆందోళన చెందుతున్నారన్నారు. 18 రోజు లకు, నాలుగు రోజులు కుటుంబంతో గడిపే పాత పద్ధతిని కొనసాగించాలన్నారు. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ పోలీసులతో వెట్టిచాకిరి చేయించి, కనీసం న్యాయం చేయడం లేదని ఆరోపించారు.