- అందరితో చర్చించాకే రైతు భరోసా
- అసెంబ్లీలో చర్చ తర్వాతే విధివిధానాలు
డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
ఉట్నూరులో ప్రజాభిప్రాయ సేకరణ
ఆదిలాబాద్, జూలై 11 (విజయ క్రాంతి): క్షేత్రస్థాయిలో రైతుల నుంచి అభిప్రాయాలు సేకరించి, అసెంబ్లీలో చర్చిం చిన తరాతే పూర్తిస్థాయి మార్గదర్శకాలతో రైతుభరోసా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్, డిఫ్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రైతు భరోసాపై ప్రజాభి ప్రాయ సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్ ప్రాంగణంలోని పీఎంఆర్సీ భవనంలో గురువారం నిరహించిన సెమి నార్‌కు భట్టితోపాటు మంత్రులు తుమ్మల నాగేశరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సీతక్క హాజరయ్యారు.
జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన రైతులు తమ అభిప్రాయాలను సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. భట్టి మాట్లాడుతూ... నాలుగు గోడల మధ్య నిర్ణయాలు తీసుకొని వాటిని ప్రజలపై రుద్ద బోమని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టులో రుణమాఫీ చేస్తామని తెలిపారు. తమ ప్రభుతం ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో కీలకమైన రైతు భరోసాను రైతుల అభిప్రాయాలకు అనుగుణంగా అమలుచేస్తామని భట్టి విక్రమార్క తెలిపారు.
రైతు భరోసా పథకం పేద బడుగు వర్గాలకు న్యా యం చేసేదిగా ఉండాలని విజ్ఞప్తులు వస్తున్నాయని చెప్పారు. ఈ పథకంపై ఇప్పటి వరకు ఎలాంటి పరిమితులు ఖరారు కాలేద ని, గ్రామం యూనిట్‌గా తీసుకోవాలని ఎక్కువమంది రైతులు సూచిస్తున్నారని పేర్కొన్నారు. పోడు రైతులకు సర్కారు సాయంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆర్థిక భారం దృష్ట్యా పెద్ద రైతులను పక్కనపెట్టి పేద, దళిత, గిరిజన రైతులకు ఈ పథకాన్ని పరిమితం చేయాలని పలువురు రైతులు కోరారని చెప్పారు. కేంద్ర ప్రభుతం పార్లమెంటులో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తరాత రాష్ర్ట ప్రభుతానికి ఇచ్చే నిధులను అంచనా వేసుకొని రాష్ర్ట ప్రభుతం కూడా పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని తెలిపారు. ఆ సమయంలోనే రైతుభరోసా అమలుపై విధివిధానాలు రూపొందిస్తామని చెప్పారు.
అర్హులకే రైతుభరోసా: తుమ్మల
అర్హులకు మాత్రమే రైతు భరోసా పథకం అందుతుందని క్యాబినెట్ సభ కమిటీ సభ్యు డు, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశరరావు అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకే అన్ని వర్గాల అభిప్రాయాలు సీకరిస్తున్నట్లు చెప్పారు. అందరి ఆలోచనల మేరకు అర్హులైన చిన్న, సన్నకారు రైతులకు రైతుభరోసా అందిస్తామని తెలిపా రు. కౌలు రైతులకు రైతు భరోసాపై భిన్న వాదనలు, అభిప్రాయాలు వస్తున్నాయని అన్నారు.
నిజమైన రైతులను ఆదుకుంటాం: పొంగులేటి
నిజమైన రైతులను ప్రభుతం అన్ని విధాలా ఆదుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హామీ ఇచ్చారు. మరో 8 ఉమ్మడి జిల్లాల్లోనూ ప్రజాభిప్రాయాలు సేకరిస్తామని తెలిపారు.
పక్కాగా పథకం అమలు: సీతక్క
రైతుల అభిప్రాయాలకు అనుగుణంగానే రైతు భరోసా పథకాన్ని అమలుచేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటివరకు ఈ పథకంపై ఎలాంటి పరిమితులు ఖారారు కాలేదని, అందరితో చర్చించిన తరాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
10 ఎకరాల పరిమితి విధించండి
పెద్ద రైతులకు పక్కనపెట్టి పేద, దళిత, గిరిజన రైతులకు రైతు భరోసా అందించాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని కోరారు. మెస్రం జంగు అనే గిరిజన రైతు మాట్లాడుతూ వర్షాధారంపైనే తాము పంట సాగు చేస్తున్నామని, ఖర్చులు పోను ఏమీ మిగడం లేదని వాపోయాడు. కౌలు రైతులకు కూడా పంటపెట్టుబడి సాయం అందించాలని కోరాడు. వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది ఎకరాలలోపు సాగుచేసే రైతులందరికీ తప్పకుండా రైతు భరోసా వర్తింపజేయాలని విన్నవించాడు.
ఆదాయ పు పన్ను చెల్లింపుదారులకు ఈ పథకాన్ని ఇవ్వొద్దని కోరారు. రియల్ ఎస్టేట్ భూము లు, సాగుకు పనికిరాని బీడు భూములకు కూడా పంటల పెట్టుబడి సాయాన్ని ఆపివేయాలని పలువురు రైతులు సూచించారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్, పెద్దపల్లి ఎంపీలు గోడం నగేశ్, వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు వెడ్మ బొజ్జు, ప్రేమ్‌సాగర్‌రావు, వివేక్ వెంకటస్వామి, కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, రామారావ్ పటేల్, పాల్వా యి హరీశ్‌బాబు, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, మంచిర్యాల కలెక్టర్ కుమార్‌దీపక్, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా, వివిధ శాఖల అధికారులు, అన్నదా తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.