గద్వాల, జనవరి 30 ( విజయక్రాంతి ) : లింగ నిర్ధారణ కోసం పరీక్షలు చేయించుకోవడం చట్టరిత్య నేరమని జిల్లా సంక్షేమ శాఖ అధికారి సునంద అన్నారు. గురువారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జోగుళాంబ గద్వాల్ జిల్లా మహిళా సాధికారిక కేంద్రంలో బేటీ బచావో బేటి పడావో కార్యక్రమం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లో పి సి పి ఎన్ డి టి ( %ూూచీణు%) చట్టంపై కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తల్లి, బిడ్డ ఆరోగ్య సమస్యల కోసం పరీక్ష చేయించుకోవాలి కానీ చాలా మంది లింగ నిర్ధారణ కోసం పరీక్ష చెపించుకుంటున్నారని, లింగ నిర్ధారణ ద్వారా ఆడ బిడ్డల భ్రూణహత్యలకు దారి తీస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సాధికారత కేంద్ర సమన్వయకర్త జ్యోత్స్న, సఖి సెంటర్ సిబ్బంది శోభ, జిల్లా బాలల సంరక్షణ విభాగం సురేష్, చైల్డ్ లైన్ దస్తగిరి, ఆసుపత్రి సిబ్బంది, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.