calender_icon.png 9 November, 2024 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రజలకు తీరని అన్యాయం

09-11-2024 12:25:11 AM

మాజీ మంత్రి కేటీఆర్

హైదరాబాద్, నవంబర్ 8 (విజయక్రాంతి): రాష్ట్రంలో సీఎం రేవంత్ పాలన మోకాలికి దెబ్బ తగిలితే బోడి గుండుకు కుట్లు వేసినట్టు ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ మూసీ బాధితులు హైదరాబాద్‌లో ఉంటే- నల్లగొండ మూసీ పరివాహక ప్రాంత రైతులను కలవడంలో రేవంత్‌రెడ్డి ఆంతర్యం ఏమిటని ప్రశ్నించా రు.

ఇళ్లు కూల్చిన చోట తిరగకుండా, ఆగిన గుండెలను పరామర్శించకుం డా ఎవరి కోసం పాదయ్రాత చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన కుట్ర లకు అంబర్‌పేట్, అత్తాపూర్ అతలాకుతలమవుతుంటే -పుట్టినరోజు వేడుకలు ఎక్కడ నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ మూసీ దాహానికి అత్తాపూర్ ఆగమైందని, -గోల్నాక గొల్లుమన్నంది, -దిల్‌సుఖ్‌నగర్ ఢీలా పడిందని వాపోయారు.