calender_icon.png 30 October, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసం

06-07-2024 01:02:17 AM

  • సైబర్ కేటుగాడి అరెస్ట్ 
  • రూ.2 లక్షల నగదు స్వాధీనం

హనుమకొండ , జూలై 5 (విజయక్రాంతి) : సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు కల్పిస్తానం టూ లక్షల రూపాయలు నిరుద్యోగుల నుంచి వసూలు చేసిన సైబర్ నేరగాన్ని వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ విభాగం పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. సైబర్ కేటుగాడి నుంచి సుమారు రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా చట్రాయి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పొనగంటి సాయితేజ(28) ఎంబీఏ పూర్తి చేశాడు. కొన్ని కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. అనంతరం జల్సాలకు అలవాటు పడ్డాడు.

దీంతో సులభంగా డబ్బు సంపాదించాలని ఉద్దేశ్యంతో నిరుద్యోగులకు బ్యాక్ డోర్ ద్వారా సాఫ్ట్‌వేర్ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానంటూ నమ్మించి అందినకాడికి దోచుకుంటున్నాడు. ఇలా రూ. లక్షల్లో వసూళ్ళకు పాల్పడ్డాడు. సాయితేజ హనుమ కొండ ప్రాంతంలోని ఓ నిరుద్యోగి నుంచి సూమారు రూ.3 లక్షలకు పైగా డబ్బు వసూలు చేసి ఫోన్ స్వీచ్ ఆఫ్ పెట్టాడు. దీంతో, మోసపోయినట్లు గ్రహించి బాధితుడు వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేశాడు.

కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్స్ పోలీసులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు 35 మంది నిరుద్యోగుల నుండి సూమారు రూ.45 లక్షలు వసూలు చేసినట్లుగా బయటపడింది. కేసులో ప్రతిభ కనబరిచిన పోలీసు సిబ్బందిని అభినందించారు.