calender_icon.png 5 February, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'తండేల్' కథ గీతా ఆర్ట్స్‌లో ఉండటం నాకు డబుల్ బొనాంజా

05-02-2025 06:23:57 PM

హీరో అక్కినేని నాగచైతన్య...

అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందు మొండేటి దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్‌బజ్‌ని క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా హీరో అక్కినేని నాగచైతన్య బుధవారం విలేకరులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ‘తండేల్’ విశేషాల సమాహారమిది...

‘తండేల్’ అర్థం ఏమిటి..? 

శ్రీకాకుళం నుంచి గుజరాత్ వెళ్లి అక్కడ బోట్స్ లీజ్‌కు తీసుకొని ఫిషింగ్ చేసుకొని అక్కడే అమ్మి తిరిగివస్తారు. ‘తండేల్’ అంటే లీడర్. ఇది గుజరాతీ వర్డ్. సినిమాని దాదాపు సముద్రంలో షూట్ చేశాం. రియల్ లొకేషన్‌లో షూట్ చేయడం పెర్ఫార్మెన్స్‌కు కూడా ప్లస్ అవుతుంది. జైల్ ఎపిసోడ్స్ చాలా ఎమోషనల్‌గా ఉంటాయి. 

ఈ సినిమాపై ప్రేక్షకుల్లో చాలా అంచనాలున్నాయి.. మీలో ఎలాంటి ఎక్సయిట్‌మెంట్ ఉంది? 

- నా కెరీర్‌లో బిగ్గెస్ట్ ప్రొడక్షన్, హై బడ్జెట్ మూవీ. క్యారెక్టర్, స్టొరీ అన్ని రకాలుగా బిగ్ స్పాన్ ఉన్న సినిమా ఇది. చాలా ఎక్సయిట్మెంట్ ఉంది. ఆల్రెడీ సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సెకండ్ హాఫ్ అయితే యునానిమాస్‌గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్ హై ఇచ్చింది. చివరి ముప్పు నిమిషాలు వెరీ సాటిస్ఫాక్షన్. క్లుమైక్స్ గ్రేట్ ఎమోషనల్ హై ఇస్తుంది. 

ఈ కథ మీ దగ్గరికి ఎలా వచ్చింది? 

‘దూత’ సినిమా సమయంలో ఈ కథ విన్నాను. నేను మొదట విన్నప్పుడు ఒక డాక్యుమెంటరీలా ఉంది. సినిమాటిక్ లాంగ్వేజ్‌లోకి తీసుకురావడానికి వర్క్ చేయాలి. బన్నీ వాసు ఈ కథను గీతా ఆర్ట్స్‌లో హోల్డ్ చేశారని తెలిసింది. డెవలప్ చేసి చెప్పమన్నాను. అలా వర్క్ చేసిన తర్వాత అద్భుతంగా వచ్చింది. 

శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని కలవడం ఎలా అనిపించింది? 

-ఈ కథ మొదట ఓ ఐడియాగా చెప్పారు. పాత్రకు తగ్గట్టుగా మారాలంటే వాళ్ల లైఫ్ స్టుల్ తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి వాళ్లను నేరుగా కలవాలని వెళ్లాం. మొత్తం హోమ్‌వర్క్ చేసిన తర్వాత నేను చేయగలనని కన్వెన్స్ అయిన తర్వాత జర్నీ మొదలైయింది. 

మీరు ఈ సినిమాకు ప్రాణం పెట్టి వర్క్ చేశారనీ.. యాక్టర్‌గా మరో స్థాయికి వెళ్తారని అంటున్నారు? 

-ప్రతి సినిమాతో ఇంకా బెటర్ అవ్వాలని ప్రతి యాక్టర్‌కీ ఉంటుంది. అయితే ఈ కథ రియల్ లైఫ్ క్యారెక్టర్ దొరికింది కాబట్టి ఇంకా మోటివేట్ అయ్యాను. యాక్టర్‌గా నెక్స్ట్ స్టెప్ వెళ్లే అవకాశం ఈ సినిమాలో కనిపించింది.  దాదాపు ఎనిమిది నెలలు స్క్రిప్ట్, నా ట్రాన్స్ ఫర్మేషన్ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాస గురించి ట్యూషన్ తీసుకున్నాను. యాస రియల్లీ ఛాలెజింగ్‌గా అనిపించింది.   

రాజు పాత్రను ఎంచుకోవడానికి కారణం..?

నాకు ఎప్పటి నుంచో రియల్ లైఫ్ స్టొరీస్ ఆధారంగా సినిమా చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ల కథ. అది నాకు స్ఫూర్తినిచ్చింది. రూటెడ్‌గా ఉండే కథలు చేయడానికి ఇష్టపడతాను. 

డైరెక్టర్ చందూ గురించి చెప్పండి...?

-చందుతో నాకు ఇది మూడో సినిమా. తనతో ట్రావెల్ అవ్వడం ఇష్టం. నన్ను కొత్తగా ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. నా కోసమే ఆలోచిస్తుంటాడు. ఈ సినిమా కమర్షియల్‌గా తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. 

ఇందులో ప్రేమకథకు ఎంత స్కోప్ ఉంటుంది? 

‘తండేల్’ అవుట్ అండ్ అవుట్ లవ్ స్టొరీ. లవ్ స్టొరీ వెనుకే మిగతా లేయర్స్ ఉంటాయి.

మళ్లీ గీతా ఆర్ట్స్‌లో చేస్తున్నారు.. ‘100 పర్సెంట్ లవ్’ మ్యాజిక్ రిపీట్ అవుతుందా? 

-అవుతుంది.. ఒక యాక్టర్‌గా మంచి దారి చూపిస్తుందని భావిస్తున్నాను. గీతా ఆర్ట్స్‌లో మళ్లీ చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాను. యాక్టర్‌కు మంచి రిలీజ్ ఇస్తారు. వాళ్ల ప్రొడక్ట్ బావుంటుంది. ఈ కథ గీతా ఆర్ట్స్ దగ్గర ఉండటం నాకు డబుల్ బొనాంజా.  

సాయిపల్లవి గురించి..! 

-పల్లవి ఫెంటాస్టిక్ యాక్టర్. ఆమెతో యాక్ట్ చేయడం ఇష్టం. తనలో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. క్యారెక్టర్‌ను డీప్‌గా అర్థం చేసుకుంటుంది. ఒక ఆర్టిస్ట్ అలా ఉన్నప్పుడు మన పెర్ఫార్మెన్స్ కూడా ఎన్ హ్యాన్స్ అవుతుంది. 

దేవిశ్రీ మ్యూజిక్ గురించి చెప్పమంటే..!  

-దేవి ఇచ్చిన బుజ్జితల్లి పాట సినిమాను గ్రౌండ్ లెవల్‌లోకి తీసుకెళ్లిపోయింది. పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దేవితో వర్క్ చేయడం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. తనతో చేసిన ప్రతి సినిమా ఆడియో సూపర్ హిట్.  

లవ్‌స్టొరీతో పాటు సర్వైవల్ డ్రామా చేయడం ఎలా అనిపించింది? 

-చాలా ఛాలెంజింగ్. ఇందులో ఒక లవ్ స్టొరీ ఉంది. అలాగే మాస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. చాలా ఇన్‌స్ఫైరింగ్‌గా అనిపించింది. ప్రతి హానెస్ట్ లవ్ స్టొరీలో ఒక పెయిన్ ఉంటుంది. ఇందులో ఆ పెయిన్‌ను బాగా ప్రజెంట్ చేశాం. ఎమోషనల్ హై చాలా కొత్తగా ఉంటుంది. ఒక యాక్టర్‌గా చాలా తృప్తినిచ్చిన సినిమా ఇది. 

ఆమీర్ ఖాన్ రియాక్షన్ ఏమిటి? 

-ఆమీర్ గారికి ట్రైలర్ చాలా నచ్చింది. 7న వాళ్ల అబ్బాయి సినిమా రిలీజ్ ఉన్నప్పటికీ ట్రైలర్ నచ్చి ఈవెంట్‌కు వచ్చారు. అలాగే కార్తి గారు కూడా కంటెంట్ నచ్చే వచ్చారు. 

శామ్ దత్ విజువల్స్ గురించి చెప్పండి... 

-బ్యూటీఫుల్ విజువల్స్ ఇచ్చారు. ‘విరూపాక్ష’ చూసి ఆయనతో వర్క్ చేయాలని అనుకున్నాను. లక్కీగా కుదిరింది, నెక్స్ట్ సినిమా కూడా ఇదే టీమ్‌తో వర్క్ చేయాలని ఉంది.

శివుని సాంగ్‌పై మీ స్పందన ఏంటి?  

-సాయిపల్లవితో డ్యాన్స్ చేయాలంటే కష్టపడాలి. (నవ్వుతూ) అయితే చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేశాం. ఆ సాంగ్ థీమ్ కూడా శివ పార్వతుల లవ్‌స్టొరీ మీద ఉంటుంది. మా క్యారెక్టర్స్ కూడా సినిమాలో శివ పార్వతుల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేశారు. అందుకే ఆ సాంగ్ ఆ థీమ్‌లో పెట్టారు. 

రియల్ లైఫ్ కథలు చేసినప్పుడు అవార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువ.. ఈ సినిమా విషయంలో మీ అంచనాలు ఎలా ఉన్నాయి?

-నేను అవార్డ్స్ గురించి ఇంకా అలోచించలేదు. అయితే అరవింద్ గారు రిలీజ్ తర్వాత నేషనల్ అవార్డ్స్‌కి పంపిస్తానని అన్నారు. నేను అయితే అంతవరకు అలోచించలేదు. ఆడియన్స్‌ను అలరించడం నాకు మోస్ట్ ఇంపార్టెంట్. అరవింద్ గారితో నాకు చాలా మంచి బాండింగ్ ఉంది. అరవింద్ గారు, వాసు, నేను ఎప్పటినుంచో ట్రావెల్ అవుతున్నాం.

‘తండేల్’ ఎలాంటి జ్ఞాపకాల్ని ఇచ్చింది? 

-రియల్ లైఫ్ క్యారెక్టర్స్‌ను కలిసినప్పుడు చాలా ఎమోషనల్‌గా అనిపించింది. వాళ్లతో చాలా టైమ్ స్పెండ్ చేశాను. వాళ్లలో ఒక నిజాయితీ కనిపించింది.  నిజాయితీ ఉన్నప్పుడు ఏదైనా సాధించగలం. 

ఈ జర్నీలో జరిగిన సంఘటనలేమైనా ఉన్నాయా? 

-షూటింగ్ సమయంలో చాలా విషయాలు జరిగాయి. ఒకసారి బోట్ కొలాప్స్ అయిపొయింది. కేరళకు వెళ్లినప్పుడు అక్కడ కోస్ట్ గార్డ్ అరెస్ట్ చేసి కెమెరామెన్ అందరినీ తీసుకెళ్లారు. ఇలా చాలా విషయాలు జరిగాయి. 

రాజు క్యారెక్టర్ గురించి చెప్పాలంటే..?! 

-రాజు ఫైటర్. జైల్లో ఉన్నప్పుడు బాధను ఓర్చుకొని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా ఉంటుంది. తన ప్రేమకథే తనకు బలాన్నిస్తుంది.