calender_icon.png 31 October, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అలా చెప్పడం సాహసమే

30-07-2024 01:55:32 AM

తయారీ కేంద్రంగా భారత్‌పై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి 

న్యూఢిల్లీ: వారానికి 72 గంటల పని గురించి చెబుతూసోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. చైనాను భారత్ అధిగమిస్తుందని పలువురు నిపుణులు చెబుతుంటేఆయన మాత్రం తయారీ రంగంలో భాత్ చైనాను దాటాలంటే అనేక సవాళ్లను అధిగమిచాల్సి ఉంటుందని అంటున్నారు.‘ ఈఎల్‌సీఐఏ టెక్ సమ్మట్ 2024’లో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.‘ ఇండియా సామర్థ్యం మీద సందేహంగా ఉంది. ఇప్పటికే చైనా ప్రపంచ కర్మాగారంగా మారింది. ఇతర దేశాల్లోని సూపర్ మార్కెట్లు, హోమ్ డిపోలలోని 90 శాతం వస్తువులు చైనాలో తయారైనవే.

అవన్నీ భారత జీడీపీకి ఆరు రెట్లు ఎక్కువ. కాబట్టి ఈ సమయంలో మన దేశం చైనాను అధిగమిస్తుందని చెప్పడం సాహసమనే చెప్పాలి’ అని నారాయణ మూర్తి అన్నారు. ఐటీ రంగ ఎగుమతుల్లో భారత్ వృద్ధి సాధిస్తుండగా, తయారీరంగం మాత్రం దేశీయ సహకారం, ప్రభుత్వ మద్దతు వంటి వాటి మీద ఆధారపడి ఉంది. కాట్టి ఇక్కడ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రభుత్వాల పాత్ర చాలా కీలకమని ఆయన అన్నారు. ఇది మెరుగుపడాలంటే ప్రభుత్వం, పరిశ్రమల మధ్య సమాచార లోపాలను తగ్గించాలని అభిప్రాయపడ్డారు. వ్యాపారవేత్తలు మార్కెట్ పరిస్థితులను మెరుగ్గా అంచనా వేయాలి.అప్పుడే తయాఈ రంగం అభివృద్ధి చెందుతుందని ఆయన అన్నారు.