ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (విజయక్రాంతి): రాష్ట్రాన్ని పాలించేందుకు చేతకాకనే సీఎం రేవంత్‌రెడ్డి కోట్లు దండుకునేందుకు కుట్ర చేస్తున్నారని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. శనివారం రాత్రి ఆయన రాజేంద్ర నగర్ హైదర్‌కోట్‌లో మూసీ నిద్ర చేశారు. మర్నాడు తెల్లవారుజామున కాలనీలో మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక ప్రజలతో ముచ్చటించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. 40 ఏండ్లుగా ప్రజలు మూసీ పరీవాహకంలోనే నివసిస్తున్నారని, వారికి బీజేపీ అండగా ఉంటుందన్నారు.