calender_icon.png 3 May, 2025 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూడు రోజులు వానలు

20-04-2025 12:32:12 AM

30-40 కి.మీ.ల వేగంతో ఈదుగాలులు 

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): రాష్ట్రంలో నేటి నుంచి మూడు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 నుంచి 40 కి.మీ.ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, నాగర్‌కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు.