calender_icon.png 20 October, 2024 | 5:31 AM

రాష్ట్రంలో నాలుగు రోజులు వర్షాలు

20-10-2024 01:09:36 AM

  1. అరేబియా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఆవర్తనాలు
  2. ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

హైదరాబాద్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): మధ్య అరేబియా, పశ్చిమ బంగాళాఖాతంలో రెండు వేర్వేరు ఆవర్తనాలు కొనసాగుతున్నాయని హైదరా బాద్ వాతావరణ కేంద్రం శనివారం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఉత్తర తమిళనాడు సమీపంలో.. మధ్య అరేబియాలో కొనసాగుతున్న ఆవర్తనం దక్షిణ ఏపీ తీరంలో కేంద్రీకృతమైనట్లు పేర్కొంది.

ఈ ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజ లు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, మహబూబాబాద్, సిద్దిపేట, రంగారెడ్డి, హైద రాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. వర్షసూచన ఉన్న జిల్లాలకు ఎల్లోఅలర్ట్ జారీ చేసింది.