calender_icon.png 29 December, 2024 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్తగా ప్రయత్నిస్తే ఆదరిస్తారని రుజువైంది

28-12-2024 12:00:00 AM

వెన్నెల కిశోర్, అనన్య నాగళ్ల, రవితేజ మహాదాస్యం ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. రైటర్ మోహన్ రచనాదర్శకత్వం వహించిన ఈ సినిమాను వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. డిసెంబర్ 25న విడుదలైన ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హీరోయిన్ అనన్య నాగళ్ల మాట్లాడుతూ.. “శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమాతోపాటు నా పాత్రకు కూడా అద్భుతమైన రెస్పాన్స్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలు ఒకెత్తు.. ఇందులో చేసిన రోల్ మరో ఎత్తు అనే రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఉంది.

కొత్త ప్రయత్నం చేస్తే తెలుగు ఆడియన్స్ సపోర్ట్ చేస్తారని మరోసారి ఈ సినిమాతో రుజువైంది” అన్నారు. ‘మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ సాధించానని అనుకుంటున్నాను’ అని నిర్మాత వెన్నపూస రమణారెడ్డి అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దర్శకుడు మోహన్, నిర్మాత వంశీ నందిపాటి తదితరులు పాల్గొన్నారు.