calender_icon.png 19 March, 2025 | 8:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆందోళనల బాటలో ఐటీ ఉద్యోగులు

19-03-2025 12:00:00 AM

డా.కోలాహలం రామ్ కిశోర్ :

భారత దేశానికి విదేశీ ద్రవ్యాన్ని తెచ్చి పెడుతున్న రంగం ఐటీ రంగం. మన దేశ ఎగుమతుల్లో  సేవల రంగం ప్రధానమైనది అయితే అందులో ఐటీ, అనుబంధ రంగాలదే పెద్ద పీట. లక్షలాది మంది యువతీ యువకులు ఈ రంగంలో పని చేస్తున్నారు. ఆకర్షణీయమైన వేతనాలు, పని చేసే ప్రదేశాల్లో సదుపాయాలు, ఉద్యోగులకు రవాణా సదుపాయం..ఇవన్నీ ఈ రంగం పట్ల యువత ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం.

అయితే పేరుకు 8 గంటల షిఫ్టులే అయినప్పటికీ అంతకు మించిప్రతి ఉద్యోగి పని చేయాల్సిన పరిస్థితి. పైగా నైట్‌షిఫ్టులు. ఇలా శ్రమదోపిడీ కూడా ఈ రంగంలో ఎక్కువే. దీనివల్ల ఈ రంగంలో పని చేసే వారు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. అయిప్పటికీ భారత ఐటీ రంగం దశాబ్దాలుగా కార్మిక సంఘాల ప్రభావం తక్కువ గా ఉన్న రంగంగా కొనసాగుతోంది.

అయితే, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సూచించిన 70 గంటల పని వారం, ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యన్ 90 గంటల పని వారం పిలుపునివ్వడం అనేక ఉద్యోగులను ఆందోళనలో ముంచేసింది. ఇప్పటికే అధిక పని ఒత్తిడితో జీవనం కొనసాగిస్తున్న ఉద్యోగులు, మరింత అదనపు పని వేళలను కంపెనీలు బలవంతంగా అమలు చేయాలని చూస్తుండటంతో వారిలో వ్యతిరేకత పెరిగింది.

ఈ నిరసనలు బెంగళూరు లోని ఫ్రీడమ్ పార్క్ నుం చి ప్రారంభమయ్యాయి. ‘మేం మీ బానిసలం కాదు’ అంటూ ఉద్యోగులు గళమెత్త గా, కార్మిక సంఘం సీఐటీయూ వారికి మద్దతుగా నిలిచింది. దీని ప్రభావం క్రమంగా దేశవ్యాప్తంగా వ్యాపించే అవకాశం ఉంది. కంపెనీల అధిపతులు తమ లాభాల కోసం పని గంటలను పెంచాలని కోరుతున్న సమయంలో, ఐటీ ఉద్యోగులు త మ హక్కులను రక్షించుకునేందుకు కొత్తగా ఉద్యమ బాట పట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఉద్యోగులపై ‘లేబర్ కోడ్’ల ప్రభావం

-----భారత ప్రభుత్వం కొత్తగా నాలుగు లేబర్ కోడ్‌లను అమలు చేయాలని నిర్ణయించింది. ఇవి పని నిబంధనలు సులభ తరం చేస్తాయని పైకి చెప్పుతున్నా, అసలు విషయం కంపెనీలకు మరిన్ని అధికారాలు కల్పించేలా ఆ కోడ్‌ల(చట్టాలు)లో ఉంది. అవి: కోడ్ ఆన్ వేజెస్, 2019-కనీస వేతనాల నియంత్రణకు ఉద్దేశించిన చట్టం.

ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, 2020-నియామకం, తొలగింపు, కార్మిక సంఘాల ఏర్పాటు వంటి అంశాలను నియంత్రిస్తుంది. ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండీషన్స్ కోడ్, 2020 --------పని గంటలు, ఉద్యోగుల సంక్షేమం గురించి చెప్పిన చట్టం. కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020 -పింఛన్లు, బీమా, ఉద్యోగ భద్రత అంశాలను కలిగి ఉంది.

ప్రభుత్వం వీటిని కార్మికుల పక్షపాతంగా చిత్రీకరిస్తున్నప్పటికీ, నూతన నియమాలు ఉద్యోగుల ను రక్షించేట్టు కాకుండా, కంపెనీలకు మరి న్ని అవకాశాలు కల్పించేవిగా ఉన్నాయి. ముఖ్యంగా పని గంటలు పెంచడాన్ని గట్టిగా ఆపే అంశం వీటిలో లేదు.

పని గంటలు పెరుగుతాయా?

-------కొత్త శ్రామిక చట్టాల ప్రకారం పది నుం డి పన్నెండు గంటల షిఫ్టులు సాధారణం గా అమలు చేయడానికి అవకాశం ఉంది. ఇది ఉద్యోగులపై మరింత ఒత్తిడిని పెంచుతుంది.కంపెనీలు 70--90 గంటల పని వారంను అమలు చేయడానికి వీలుగా కొత్త చట్టాలలో కచ్చితమైన నిరోధకత లేకపోవడం కంపెనీలకు కలిసొచ్చే అంశం.

300 మందికి లోపు ఉద్యోగులు ఉన్న సం స్థలు ప్రభుత్వ అనుమతి లేకుండా ఉద్యోగులను తొలగించేందుకు వీలుగా ఈ చ ట్టంలో ఉంది. కాంట్రాక్ట్ ఉద్యోగుల సంఖ్య పెరిగే అవకాశముంది. దీని వల్ల కంపెనీలు శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించకుండా తప్పించుకునే అవకాశం ఉంటుంది.

కార్మిక సంఘాలకు కొత్త అవరోధాలు

----భారత కార్మిక చట్టాలలో కొత్తగా మా ర్పులు వచ్చిన నేపథ్యంలో, ఐటీ రంగంలో కార్మిక సంఘాల ఏర్పాటుపై కొత్త కఠిన నిబంధనలు వచ్చాయి. సంస్థలో అదనం గా 51 శాతం మంది మద్దతు ఉంటేనే యూనియన్ యాజమాన్యం గుర్తింపు పొం దుతుంది. ఇది యాజమాన్యానికి అ నుకూలంగా ఉంది. యాజమాన్యం ఉద్యోగులను మేనేజర్ లేదా సూపర్వైజర్‌గా వర్గీ కరిస్తే, వారు కార్మిక సంఘ సభ్యత్వ అర్హత పొందలేరు.

నిరసనలు చేపట్టే ముందు కనీసం 60 రోజుల ముందు కంపెనీకి నో టీసు ఇవ్వాలి. కంపెనీ నిర్ణయం కొరకు తగిన సమయం ఇచ్చి ప్రతిస్పందన కొర కు ఎదురుచూడాలి, దీని వల్ల  హఠాత్తుగా ఏదైనా కంపెనీలో సమ్మె చేపట్టడం కష్టం. ఈ నిబంధనలు ఐటీ ఉద్యోగుల్ని సంస్థల కఠిన నియంత్రణలోకి తేవడానికే దోహ దం చేస్తాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వం ఏం చేస్తుంది?

-------ప్రస్తుతం ఐటీ రంగంలో కార్మిక ఉద్య మం వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో,  కేంద్రంలోని  ప్రభుత్వం దీన్ని ఎలా ఎదుర్కొంటుందన్న ప్రశ్న ఉత్పన్నమైంది. కా ర్పొరేట్ మద్దతు, ప్రజాస్వామిక వ్యతిరేకత,  ప్రభుత్వ విధానాలు పెద్ద సంస్థలకు మేలు చేసే విధంగా ఉన్నప్పటికీ, ఉద్యోగుల నిరసన దీన్ని సమర్థించడం కష్టతరం చేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు  ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో ఈ ఉద్య మాన్ని అణచివేయడానికి పోలీసులు జో క్యం చేసుకునే అవకాశం ఉంది. ----నిరసనలు తగ్గించేందుకు, తాత్కాలిక ఉపశమనం కల్పించేలా కొన్ని సవరణలు చేయవచ్చు, కానీ పని ఒత్తిడిని తగ్గించేలా ప్రధాన మార్పులు రావటానికి అవకాశాలు లేవు.

శ్రమదోపిడీపై వ్యతిరేకత

----ఈ నూతన పరిస్థితుల దృష్ట్యా, ఐటీ ఉద్యోగులు కొన్ని మార్గాలను అన్వేషించవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఉద్యమానికి బలం చేకూర్చేందుకు యత్నించవచ్చు. -----ఉద్యోగులు సామాజిక మాధ్యమాలను ఉప యోగించి తమ నిరసనను విస్తృతంగా వ్యాప్తి చేయవచ్చు. ఐటీ రంగానికి ప్రత్యేకం గా కొత్త యూనియన్లు ఏర్పడే అవకాశం ఉంది. ----ప్రస్తుతం ఉన్న కార్మిక సంఘాలతో పాటు, ప్రత్యేకంగా ఐటీ ఉద్యోగుల హక్కులను కాపాడేందుకు కొత్త యూనియన్లు రావచ్చు.  కొన్ని కంపెనీలను కోర్టులోకి తీసుకెళ్లి ఉద్యోగుల హక్కులను రక్షించేందుకు ప్రయత్నాలు జరుగవచ్చు.

డా. సౌమ్యా స్వామినాథన్ వ్యాఖ్యలు

-----ఇటీవల ఎం.ఎస్. స్వామినాథన్ కుమా ర్తె, ప్రపంచ ఆరోగ్య సంస్థ( డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్ సైంటిస్టు డా.సౌమ్యా స్వామినాథన్ మాట్లాడుతూ, పని గంటలు పెంచడం వల్ల ఉద్యోగుల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొన్నారు. పని , విశ్రాంతి అనేవి ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటాయి. విశ్రాంతి లేకుండా ఏ ఉద్యోగి సుదీర్ఘంగా నాణ్యతతో పని చేయలేడు.

ఒక పరిశ్రమ లో నాణ్యతా ఉత్పత్తి రావాలంటే, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన పని వాతావరణం కల్పించాలి. వాళ్లను యంత్రాల్లా కాకుం డా, మనుషుల్లా చూడాలని ఆమె స్పష్టం చేశారు. భారత ఐటీ రంగం ఇప్పుడు కీలక మలుపులో ఉంది. కొత్త లేబర్ కోడ్‌ల (చట్టాలు) కారణంగా ఉద్యోగుల హక్కులు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.

అయితే, బెంగళూరులో ప్రారంభమైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా కార్మిక చైతన్యాన్ని పెంచే అవకాశముంది. ప్రభు త్వం, కంపెనీలు కలిసి ఉద్యోగుల పని ఒత్తిడిని మరింత పెంచే విధానాలను ప్రోత్సహిస్తే, దీనికి వ్యతిరేకంగా ఉద్యోగుల ఐక్యత మరింత బలపడే అవకాశం కూడా ఉంది. పని గంటల పెంపు వ్యతిరేక ఉద్యమం ఐటీ రంగంలో కార్మిక సమూహాలను ఏకతాటిపైకి తెచ్చే మార్గం గా మారుతుందా? లేదా? అనేది రాబో యే కాలం నిర్ణయించనుంది.

 వ్యాసకర్త సెల్: 9849328496.