calender_icon.png 23 January, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాలం కలసిరాక పని చేయలేదు..!

23-01-2025 12:54:33 AM

  • చేసిన పనులకు ఇంతవరకు బిల్లులు రాలేదు

రూ.మూడు కోట్లు నిల్వ ఉంచాం

రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్

రామాయంపేట, జనవరి 22: ఐదు సంవత్సరాలు ప్రజల కోసం సేవ చేయాలని, అభివృద్ధి చేయాలని అనుకున్నా పూర్తి చేయలేకపోవడం దురదృష్టకరమని రామాయంపేట ప్రజలు తమను క్షమించాలని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ తెలిపారు.

బుధవారం జరిగిన వీడుకోలు సమావేశంలో మాట్లాడుతూ ఎంతో ఆశతో వచ్చిన తమకు కరోనా రావడంతో పూర్తిగా అభివృద్ధిని చేయలేకపోయామని, శాయశక్తుల కరోనాను ఎదుర్కొని రామయంపేట ప్రజలకు పేదలకు నిత్యవసర వస్తువులు అందించడంతో పాటు ఆ సమయంలో మరణించిన 40 మందికి వారి బంధువులు రాకుండా దగ్గర ఉండి అంత్యక్రియలు నిర్వహించామన్నారు.

ఇతర రాష్ట్రాల కూలీలకు అయ్యప్ప గుడి వద్ద అన్నదానాలు నిర్వహించడం జరిగిందన్నారు. అనేక పథకాల ద్వారా వచ్చిన పది కోట్ల రూపాయలు పనులు పూర్తి చేసామన్నారు. కానీ ఇప్పటివరకు ఆరున్నర కోట్ల బిల్లులు రాకపోయినా పనులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే రోహిత్రావు, ఎంపీ రఘునందన్రావు నిధులు మంజూరు చేయించాలన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో 12 మంది కౌన్సిలర్లకు, కోఆప్షన్ సభ్యులకు మున్సిపల్ కార్య నిర్వాహక వర్గం శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమిషనర్ దేవేందర్, మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.