07-02-2025 12:40:07 AM
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆదాయం పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టం రాబోతోంది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే వారం పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. పాత చట్టంతో పోలిస్తే ఇందులోని నిబంధనలు అందరికీ అర్థమయ్యేలా ఉండబోతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ బిల్లుపై శుక్రవారం కేంద్ర కేబినెట్‌లో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.