స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో కొనసాగుతోన్న సోదాలు
షాద్‌నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమి అమ్మకాలు
హైదరాబాద్ (విజయక్రాంతి): హైదరాబాద్ మహానగరంలో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ఇవాళ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ స్వస్తిక్ రియల్టర్ కంపెనీలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సంస్థ నిర్వాహకులైన కల్పన రాజేంద్ర, లక్ష్మణ్ నివాసాలతో పాటు షాద్‌నగర్, చేవెళ్ల, బంజారాహిల్స్ కార్యాలయాలతో సహా మొత్తం మూడు చోట్ల ఏకకాలంలో దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవలే స్వస్తిక్ గ్రూప్ షాద్‌నగర్ ప్రాంతంలో ఓ ఎంఎన్‌సీ కంపెనీకి రూ.300 కోట్ల విలువైన భూమిని అమ్మింది. అయితే, బ్యాలెన్స్ షీట్స్‌లో భూ విక్రయానికి సంబంధించి లెక్కలు చూపలేదనే ఆరోపణ నేపథ్యంలో ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు.