102 దరఖాస్తులు స్వీకరణ జిల్లా అదనపు కలెక్టర్ నగేష్
మెదక్, జనవరి 20 (విజయక్రాంతి): ప్రజావాణిలో ప్రజల నుండి వచ్చిన సమస్యలకు అధికారులు కృషిచేసి అధిక ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కారం చూపాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 102 దరఖాస్తులు రాగా వాటిలో ధరణి-38 , ఇందిరమ్మ ఇండ్లు-11, రుణమాఫీ-03 రేషన్ కార్డుల కొరకు-10, ఇతర సమస్యలు -40.
సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ భుజంగరావు, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ పీడి శ్రీనివాసరావు సంబంధిత ఇతర శాఖల అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ స్వీకరించారు. ప్రజల నుండి అందిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించుటకు సంబంధిత శాఖలకు ఎండార్స్ చేసి సిఫారసు చేశారు. ఇప్పటి వరకు పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు.