24-02-2025 07:40:37 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణానికి చెందిన ఫోటోగ్రాఫర్ అడిచర్ల మహేష్ అనారోగ్యంతో మృతి చెందడంతో సోమవారం అతని కుటుంబ సభ్యులకు బెల్లంపల్లి ఫోటో, వీడియో గ్రాఫర్ల సంఘం అధ్యక్షులు ఆకుల వేణు ఆధ్వర్యంలో కుటుంబ భరోసా పథకం ద్వారా మంజూరైన రూ 1,60,000 లతో పాటు మండల యూనియన్ నుండి మరో రూ 30 వేలను చెక్కు రూపంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో, వీడియో గ్రాఫర్ల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు ఉదయ్ కుమార్, మహేష్, మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్లకొండ కనకయ్య, మాజీ రాష్ట్ర కార్యదర్శి అప్పసు రామన్న, జిల్లా ఇన్చార్జి అధ్యక్షులు నల్ల సతీష్, జిల్లా మాజీ గౌరవ సలహాదారులు ఖాన్ పెళ్లి శంకర్ బాబు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆకునూరి రాజకుమార్, మండల సెక్రెటరీ కాంపెల్లి విజయ్ కుమార్, కోశాధికారి మడుపు విక్రమ్, వర్కింగ్ ప్రెసిడెంట్ నస్పూరి సందీప్ లు పాల్గొన్నారు.