హైదరాబాద్ సిటీ బ్యూరో (విజయక్రాంతి): ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ప్యారడైజ్ జంక్షన్ నుండి శామీర్ పేట్ ఓఆర్ఆర్ జంక్షన్ (SH 01)వరకు, ప్యారడైజ్ జంక్షన్ నుండి డైరీ ఫామ్ (ఎన్ హెచ్ -44) వరకు నిర్మించానున్న ఎలివేటెడ్ కారిడార్ భూసేకరణ కోసం మంగళవారం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్టర్లు, సర్వేయర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన రెవెన్యూ గ్రామాల వారీగా భూసేకరణపై సమీక్షించినారు. ఈ సందర్భంగా భూసేకరణ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ముకుంద రెడ్డి, డిఆర్ఓ వెంకటాచారి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, సబ్ రిజిస్టర్లు, సర్వేయర్ లు తదితరులు పాల్గొన్నారు.