calender_icon.png 19 March, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్కు నిర్వహణ సరిగా లేదు నోటీసులు జారీ చేయండి

19-03-2025 02:12:07 AM

కమిషనర్ ఆదేశం

కరీంనగర్, మార్చి18 (విజయక్రాంతి): కరీంనగర్ లోని జ్యోతిబా పూలే పార్కును మంగళవారం రోజు కమీషనర్ చాహాత్ బాజ్ పాయ్ సందర్శించారు. పార్కులో పర్యటించి...తనిఖీ పరిశీలించారు. పార్కు నిర్వహణ సరిగా లేకపోవడం తో స్థానికంగా ఉన్న సిబ్బందిని ప్రశ్నించారు. అనుమతి లేకుండా పార్కులో స్టాల్స్ ఏర్పాచేశారుయడంతో పాటు పార్కు నిర్వహణ సరిగా లేకపోవడం తో...అసంతృప్తి వ్యక్తం చేశారు.

సంబంధిత కాంట్రాక్టర్ కు నోటీసులు జారీ చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పార్కులొ ఉన్న పూల మొక్కలు, గ్రీనరీకి సమయం ప్రకారం నీరు అందించడంతో పాటు గ్రాస్ కట్టింగ్ చేసి పరిశుభ్రతను పాటించేలా అధికారులు చర్యలు తీస్కోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఈ లచ్చిరెడ్డి, వెంకటేశ్వర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్ పర్షరాములు తదితరులు పాల్గొన్నారు.