calender_icon.png 20 January, 2025 | 5:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

20-01-2025 12:56:30 AM

మహబూబ్ నగర్, జనవరి 19 (విజయక్రాంతి) : రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అందించే ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని ప్రజలు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి స్పష్టం చేశారు. ఈనెల 21 నుంచి 24వ తేదీ వర కు నిర్వహించనున్న గ్రామసభల్లో లబ్ధిదారుల దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుందని పేర్కొ న్నారు.

ప్రస్తుతం అధికారుల దగ్గర గతంలో నిర్వహించిన సామా జిక సర్వే ప్రకారం వివరాలు ఉన్నాయని, గ్రామసభల్లో అర్హులైన ప్రతిదారిని వివరాలను పరిగణలోకి తీసుకొని అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని తెలిపారు. ఎవరో ఏదో చెప్పారని ఆ వాటిని నమ్మవలసిన అవసరం లేదని ప్రతి ఒక్కరికి మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలియజేశారు.