calender_icon.png 20 January, 2025 | 11:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ

20-01-2025 12:00:00 AM

  1. అర్హులందరకీ సంక్షేమ ఫలాలు 
  2. మంత్రి జూపల్లి కృష్ణారావు

కామారెడ్డి, జనవరి 19 (విజయక్రాంతి): రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని, సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా కృషి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి, నిజామాబాద్ ఇన్‌చార్జి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల పథకాలపై ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్‌లో ఉమ్మడి జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగ మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. సాగులేని భూములను గూగుల్ మ్యాప్ ద్వారా గుర్తించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో కలెక్టర్లు రాజీవ్‌గాంధీ హనుమంతు, ఆశిష్ సంగ్వాన్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్‌రెడ్డి, ధన్‌పాల్ సూర్యానారాయణ, భూపతిరెడ్డి, తోట లక్ష్మీకాంతా రావు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, డమీ చైర్మన్ తాహెర్‌బీన్ హుందాన్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.