07-02-2025 07:59:00 PM
బూర్గంపాడు (విజయక్రాంతి): బూర్గంపాడు మండల కేంద్రంలో ఫుట్ పాత్ పై అక్రమంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై గ్రామపంచాయతీ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 37 మందికి ఆర్ అండ్ బి అధికారులు నోటీసులు జారీ చేయగా, ప్రస్తుతం 25 మందికి పంచాయతీ సెక్రటరీ బర్ల ప్రభాకర్ నోటీసులు జారీ చేశారు. నోటీసులకు స్పందించి అక్రమ నిర్మాణాలు, డ్రైనేజీ ఆక్రమణలు తొలగించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.