calender_icon.png 16 November, 2024 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెలవారీ బిల్లులు, పన్నుల జారీ!

15-09-2024 05:58:48 AM

అధికారులను ఆదేశించిన సీఎం రేవంత్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయ క్రాంతి): నెలవారీగా బిల్లులు, పన్నులు చెల్లించడం ద్వారా ప్రజలపై ఎక్కవ ఆర్థిక భారం పడకుండా ఉంటుందని, నెలా నెలా బిల్లుల జారీకి ఉన్న సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆస్తి పన్ను, నల్లా బిల్లు, కరెంటు బిల్లు, చెత్త సేకరణ బిల్లు వంటి బిల్లుల సేకరణపై శనివారం సీఎం రేవంత్‌రెడ్డి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. పన్ను లు, బిల్లులు నెలవారీగా జారీచేసేలా కొత్త విధానంపై కసరత్తు జరుగుతుందని తెలిపారు. సులభ వాయిదా పద్ధతిలో బిల్లులు చెల్లించడంపై వచ్చిన విజ్ఞప్తులు, అభిప్రాయాలను అధికారులతో పంచుకున్నారు.

యూపీఐతోపాటు అన్ని ఈ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నెలా నెలా ఈ బిల్లులు చెల్లించేలా సిటిజన్ ఫ్రెండ్లీ ఈజీ పేమెంట్ విధానం ఉండాలని సూచించారు. కరెంట్ బిల్లు చెల్లించ కుంటే గడువు దాటిన తర్వాత అపరాధ రుసుము, కరెంటు కట్ చేసేలా చర్యలు ప్రస్తుతం అమల్లో ఉన్నాయని పేర్కొన్నారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ, జలమం డలి అనుసరించే విధానంలోనూ ఆస్తి పన్ను, నల్లా బిల్లులకు నిర్ణీత గడువు ఉండాలని, గడువు దాటితే ఒకదానికొకటి లింకు ఉండేలా చర్యలపై కసరత్తు చేయనున్నట్టు వెల్లడించారు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించే వారికి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వాలని సీఎం సూచించారు.

అలాంటి వారికి ఆర్థిక సంవత్సరం చివరి నెల బిల్లులో రాయితీని ఇవ్వాలని లేదా కాలనీల వారీగా కొందరికి బహుమతులు ఇవ్వాలనే ఆలోచనలు ఉన్నట్టు తెలిపారు. బిల్లుల చెల్లింపుల విషయంలో ఉన్నట్టుగానే మున్సిపల్ సేవలను మహానగర ప్రజలకు అందించే విషయంలోనూ జవాబు దారీగా ఉండాలని అధికారులను అప్రమత్తం చేశారు. ఎల్‌ఆర్‌ఎస్‌పై వచ్చే ఆదాయం ప్రభుత్వ ఖాతాలో కాకుండా నేరుగా కార్పొరేషన్ల ఖాతాలో జమ అయ్యేలా ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. 

టాస్క్‌ఫోర్స్ తరహాలో హైడ్రా: రంగనాథ్

  1. ప్రత్యేక ఏజెన్సీగా ఏర్పాటుకు సన్నాహాలు 
  2. త్వరలో ఆర్డినెన్స్ ద్వారా హైడ్రాకు చట్టబద్ధత 
  3. 6 వారాల తర్వాత అసెంబ్లీలో చట్టం 
  4. ఆపై హైడ్రాకు మరిన్ని అధికారులు 
  5. క్రెడాయ్ సమావేశంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): చెరువులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై కొరడా ఝులిపిస్తున్న హైడ్రాకు త్వరలోనే చట్టబద్ధత వస్తుందని ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ ప్రకటించారు. హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్లో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హజరైన రంగనాథ్ మాట్లాడుతూ జీవో నంబర్ 99 ద్వారా హైడ్రా ఏర్పాటైందని, కార్యనిర్వాహక వ్యవస్థ ద్వారా వచ్చిన జీవోకు కూడా చట్టబద్ధత ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలో ప్లానింగ్ కమిషన్, లా కమిషన్, ఏసీబీ, విజిలెన్స్.. రౌడీలు, గుండాల కట్టడికి పోలీస్ శాఖలో ఉండే టాస్క్‌ఫోర్స్, నక్సలైట్ల ఏరివేత కోసం పనిచేసే గ్రేహౌండ్స్‌లాగా హైడ్రా కూడా టాస్క్ ఓరియెంటెడ్‌గా పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుతం హైడ్రాకు చట్టబద్ధత ఉందా.. లేదా? అనే వివాదం కోర్టులో ఉన్నదని చెప్పారు. 

మరో 6 వారాల్లో ఆర్డినెన్స్ రూపంలో హైడ్రాకు చట్టబద్ధత వస్తుందని, ఆ తర్వాత అసెంబ్లీలో 6 వారాల్లో చట్టంగా మారుతుందని వెల్లడించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయని చెప్పారు. అనంతరం వాల్టా, మున్సిపాలిటీ, ఇరిగేషన్ అధికారాలను కల్పిస్తామని, వీటన్నింటినీ కలుపుకొని పాలసీ డాక్యుమెంట్‌గా రానున్నట్టు వివరించారు. 

త్వరలో హైడ్రాకు విస్తృత అధికారాలు

హైదరాబాద్‌లో చిన్న వర్షానికే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఆ పరిస్థితిని చక్కదిద్దే లక్ష్యంతోనే హైడ్రా ఏర్పాటైందని రంగనాథ్ తెలిపారు. హైడ్రా డిజిస్టార్ మేనేజ్‌మెంట్‌తోపాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం కృషి చేస్తుందని చెప్పారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులు, ట్రాఫిక్ సంబంధ ఆక్రమణలపై పనిచేస్తుందని వెల్లడించారు. స్థానికంగా ఉండే మున్సిపాలిటీ, రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలకు అసెట్‌గా ఉం టుందని తెలియజేశారు. హైడ్రాకు చట్టబద్ధత వచ్చాక మరిన్ని అధికారాలు లభిస్తా యని తెలిపారు.

ఇటీవల హైడ్రా అధికారు లు మాదాపూర్ సున్నం చెరువులో కూలీ ల గుడిసెలను కూల్చివేయడమే కాకుండా, వారు ఖాళీ చేసేందుకు కూడా ఏమాత్రం సమయం ఇవ్వకపోవడంపై విమర్శలు వచ్చాయి. దీంతో సున్నం చెరువు బాధితు ల్లో ఓ మహిళ హైడ్రాకు చట్టబద్ధత లేదం టూ హైకోర్టుకు వెళ్లారు. విచారణ జరిపిన కోర్టు హైడ్రాకు చట్టబద్ధత ఉందో లేదో తెలుపాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.