నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ మున్సిపాలిటీతో పాటు వివిధ మండలాల్లో అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎల్ఓసి పత్రాలను నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సోమవారం అందించారు. మొత్తం 22 మందికి రూపాయలు 55 లక్షల విలువచేసే ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకన్ రెడ్డి, సీనియర్ నాయకులు సత్యం గౌడ్, పార్టీ నేతలు పాల్గొన్నారు.