calender_icon.png 16 January, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత విద్యుత్ జీవో జారీ

06-09-2024 01:16:37 AM

ఉత్తర్వులు విడుదల చేసిన విద్యుత్ శాఖ సెక్రటరీ

విద్యా సంస్థల సమాచారంతో విభాగాల వారీగా ప్రత్యేక పోర్టల్

ఆర్థిక శాఖతో అనుసంధానం, డిస్కంలకు బిల్లుల చెల్లింపు

హైదరాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యా సంస్థలన్నింటికీ ఉచిత విద్యుత్‌ను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విద్యాసంస్థలకు సంబంధించిన ఉచిత విద్యుత్ ఉత్తర్వులను విద్యుత్ శాఖ సెక్రటరీ రోనాల్డ్ రోస్ గురువారం జారీచేశారు. గురువారం నుంచే ఈ ఉత్త ర్వులు అమల్లోకి వస్తాయని తెలిపారు. తెలంగాణలోని రెండు డిస్కం లు నిర్వహించే  ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రభుత్వ విద్యా సంస్థల ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించిన జాబితాలను పొందుపర్చుతారు.

ప్రతి నెలా ఆయా విద్యా సంస్థలు ఉపయోగించుకునే విద్యుత్ బిల్లును ఆన్‌లైన్ పోర్టల్‌లో పొందుపర్చుతారు.  బిల్లును సంబంధింత విద్యా సంస్థ ఇన్‌చార్జికి ఇస్తారు. దీనితోపాటు పోర్టల్‌లోనూ విద్యా సంస్థల వారీగా, మండలాలు, జిల్లాల వారీ గా విద్యా సంస్థలు ఉపయోగించున్న విద్యుత్తు, బిల్లు మొత్తం, బిల్లుల చెల్లింపులు, బకాయిలు తదితర సమాచారమంతా ఆయా విభాగాల వారీగా అందుబాటులో ఉంటుంది. ఈ పోర్టల్‌ను ఆర్థిక శాఖతో అనుసంధానిస్తారు. దీనివల్ల ఆర్థిక శాఖ  నేరుగా ప్రతి నెలా బిల్లులకు సంబంధించిన మొత్తాన్ని డిస్కంలకు చెల్లిస్తుంది.