భూమిపై అంతరిక్ష పరిస్థితుల కల్పనకు వీలు
న్యూఢిల్లీ, నవంబర్ 1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో తన మొదటి అనలాగ్ స్పేస్ మిషన్‌ను గురువారం లేహ్‌లో ప్రారంభించింది. ఈ మిషన్‌ను హ్యూమన్ స్పేస్ ఫ్లుటై సెంటర్, ఇస్రో, ఆక స్పేస్ స్టూడియో, లడఖ్ యూనివర్సిటీ, ఐఐటీ బాంబే రూపొందించాయి. అంతరిక్షంలో ఉండే పరిస్థితులను భూమిపై కృత్రిమంగా ఏర్పాటు చేయడాన్ని అనలాగ్ మిషన్‌గా పేర్కొంటారు. భవిష్యత్‌లో వ్యోమగాములు ఎదుర్కొనే సవాళ్లను అధిగమించడం, విశ్వంలో జీవాన్వేషణ ఈ మిషన్ ముఖ్య లక్ష్యం.
త్వరలో గగన్‌యాన్‌తో మానవసహిత ప్రయోగానికి భారత్ సిద్ధమైన నేపథ్యంలో ఈ మిషన్ ఎంతో ఉపయోగపడుతోంది. అంతరిక్షంలోకి వెళ్లే ముందు భూమిపై అంతరిక్షం వంటి క్లిష్ట పరిస్థితుల్లో వ్యోమగాములకు శిక్షణ ఇచ్చేందుకు ఈ మిషన్‌ను రూపొం దించారు. దీనిలో అంతరిక్షంలో ఉండే వాతావరణాన్ని ఏర్పాటు చేసిన శిక్షణ ఇస్తారు.