calender_icon.png 16 January, 2025 | 2:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇస్రో మరో ఘనత

16-01-2025 11:57:09 AM

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(Indian Space Research Organisation) మరో ఘనత సాధించింది. అంతరిక్షంలో రెండు ఉపగ్రహాల డాకింగ్ ప్రక్రియ విజయవంతం అయింది. డాకింగ్ సాంకేతిక అభివృద్ధి చేసిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సాదించింది. ఇప్పటివరకు చైనా, రష్యా, అమెరికా మాత్రమే అంతరిక్షంలో రెండు ఉపగ్రహాలను అనుసంధానం చేస్తున్నాయి. తాజా ప్రయోగంతో భారతదేశం కూడా వాటి సరసన చేరి చరిత్ర సృష్టించింది.

శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం(satish dhawan space centre sriharikota) 220 కిలోల బరువున్నఉపగ్రహాలను 475 కిలో మీటర్లు వృత్తాకార కక్ష్యలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో డాకింగ్ కీలకం కానుంది. అభివృద్ధి చేసే క్రమంలో స్పేడెక్స్ ప్రయోగాన్ని భారత్ చేపట్టింది. స్పేస్ డాకింగ్ ప్రయోగం (స్పాడెక్స్)లో భాగంగా ఇస్రో(ISRO ) గురువారం ఉపగ్రహాల డాకింగ్‌ను విజయవంతంగా నిర్వహించిందని అంతరిక్ష సంస్థ వర్గాలు తెలిపాయి. అంతకుముందు జనవరి 12 న, ఇస్రో రెండు అంతరిక్ష నౌకలను మూడు మీటర్లకు తీసుకువచ్చింది. ఉపగ్రహాలను డాక్ చేసే ట్రయల్ ప్రయత్నంలో వాటిని తిరిగి సురక్షిత దూరానికి తరలించింది.

ISRO డిసెంబర్ 30, 2024న తిరుపతి జిల్లా సతీశ్ ధవన్ స్పేష్ సెంటర్(షార్) నుంచి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C60 రాకెట్ రెండు ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపించింది. బయలుదేరిన పీఎల్ ఎల్ వీ 15.09 నిమిషాలకు స్పేడెక్స్-1బి, 15.12 నిమిషాలకు స్పేడెక్స్-1ఎ రాకెట్(SpaDeX Mission) నుంచి విడిపోయింది. అనంతరం వీటి డాకింగ్ కోసం మూడు సార్లు ప్రయత్నించారు. కానీ పలు కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. చివరకు గురువారం నాడు అంతరిక్ష నౌక డాకింగ్ ప్రక్రియ చేపట్టారు. ఈ క్రమంలోనే రెండు ఉపగ్రహాల దూరాన్ని 15 మీటర్ల నుండి 3 మీటర్లు హోల్డ్ పాయింట్ వరకు తీసుకొచ్చారు. అక్కడ ఉపగ్రహాలను ఆపి డాకింగ్ ప్రారంభించారు. ఇది విజయవంతమైనట్లు ఇస్రో తమ ఎక్స్ లో పోస్టు చేసింది. దీనికోసం కష్టపడిన సాంకేతిక బృందానికి, యావత్ భారతావనికి ఇస్రో అభినందనలు తెలిపింది.