calender_icon.png 23 February, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఐటీ మద్రాస్‌తో జతకట్టిన ఇస్రో

23-02-2025 12:41:13 AM

మెటల్ ఫోమ్ అభివృద్ధికి రంగం సిద్ధం

చెన్నై,(విజయక్రాంతి): భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రస్తుతం ‘భారతీయ అంతరిక్ష్ స్టేషన్ (ఇండియన్ స్పేస్ స్టేషన్)’ అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో స్పేస్ స్టేషన్‌ను కప్పి ఉంచడానికి మెటల్ ఫోమ్ అవసరం కానుంది. ఈ నేపథ్యంలో మెటల్ ఫోమ్ తయారీపై ఇస్రో శనివారం ఐఐటీ మద్రాస్‌తో జతకట్టింది. ఐఐటీ మద్రాస్‌కు చెందిన ఎక్స్‌ట్రా టెరెస్ట్రియల్ మానుఫాక్చరింగ్ (ఎక్స్‌టెమ్) బృందం మెటల్ ఫోమ్ అభివృద్ధి కోసం కృషి చేయనుంది. మెటల్ ఫోమ్ తయారీ కోసం ఎక్స్‌టెమ్ బృందం రెండు ప్రాథమిక లక్ష్యాలను ముందుకు తీసుకొచ్చింది. అందులో ఒకటి ‘మేకింగ్ ఇన్ స్పేస్ ఫర్ స్పేస్’ కాగా.. రెండోది ‘మేకింగ్ ఇన్ స్పేస్ ఫర్ ఎర్త్’. ఇప్పటికే ఈ బృందం సున్నా గురుత్వాకర్షణ పరిస్థితులను అధ్యయనం చేయడానికి ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మైక్రోగ్రావిటీ డ్రాప్ టవర్‌ను అభివృద్ధి చేయడం విశేషం. మెటల్ ఫోమ్‌పై నీలభ్ మెనారియా చేసిన పరిశోధనల ఆధారంగా మైక్రోగ్రావిటీని మెరుగుపరచడం ద్వారా ఉల్కల ప్రభావం నుంచి అంతరిక్ష కేంద్రాన్ని కాపాడవచ్చని తేలింది.